»The Case Against Ar Rahman For Not Taking The Amount And Not Performing The Concert
AR Rahman: అమౌంట్ తీసుకుని కచేరీ చేయలేదని రెహమాన్ పై కేసు!
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ మళ్లీ వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ సంస్థ తరఫున తమకు కచేరి చేస్తానని డబ్బులు తీసుకుని రెహమాన్ ఇంతవరకు చేయలేదని ఫిర్యాదు చేసింది. అయితే వీరి ఫిర్యాదుపై రెహమాన్ తరఫు న్యాయవాదులు స్పందించారు.
The case against ar Rahman for not taking the amount and not performing the concert
AR రెహమాన్ తన చెన్నై సంగీత కచేరీ నిర్వహణ లోపం కారణంగా సెప్టెంబరులో వార్తల్లో నిలిచారు. ఆ దుర్ఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత, అతను మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా(Association of Surgeons of india) రెహమాన్‌పై ఫిర్యాదు నమోదు చేసింది. అతను వారి సంగీత కచేరీ కోసం రూ.29 లక్షలు అందుకున్నాడు. కానీ కచేరీ ఎప్పుడూ నిర్వహించలేదని కంప్లైంట్ చేశారు. మరోవైపు ఈ అంశంపై ఏఆర్ రెహమాన్ తరపు న్యాయవాదులు స్పందించారు. అయితే ఈ ఆరోపణలను AR రెహమాన్ తరఫు న్యాయవాదులు తిరస్కరించారు. అతని పరువు తీయాలని చూసినందుకు గాను పరిహారంగా 10 కోట్ల రూపాయలు చెల్లించాలని వారు కోరారు.
ఏఆర్ రెహమాన్(ar Rahman) ప్రతిష్టను కించపరిచినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లీగల్ నోటీసులో ఆయన అసోసియేషన్‌ను కోరారు. అంతేకాకుండా, రెహమాన్ తరపు న్యాయవాది అతని పరువు తీసినందుకు గాను రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని అసోసియేషన్‌ను డిమాండ్ చేశారు. నష్టపరిహారం చెల్లించడంలో విఫలమైతే సంగీతకారుడు చట్టపరమైన, క్రిమినల్ చర్యలకు(criminal) దిగుతామని స్పష్టం చేశారు. 2018లో సంగీత విద్వాంసుడు రూ. 29 లక్షలు అందుకున్నట్లు రెహమాన్‌పై అసోసియేషన్ ఫిర్యాదులో పేర్కొంది.