»Terrible Trolling On Samantha Dont You Believe It
Samantha: సమంత పై దారుణమైన ట్రోలింగ్.. నమ్మడం లేదా?
స్టార్ బ్యూటీ సమంత అంటే.. ఎప్పుడు హాట్ టాపికే. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే సామ్.. ఎప్పటికప్పుడు ఏదో విషయాన్ని అభిమానులతో షేర్ చేస్తు ఉంటుంది. కానీ సమంత పై మాత్రం ట్రోలింగ్ ఆగడం లేదు.
Terrible trolling on Samantha.. Don't you believe it?
Samantha: ఓసారేమో నేను చాలా ఫిట్‌గా ఉన్నాను అంటుంది.. మరోసారేమో మయోసైటిస్‌తో బాధపడుతున్నాను.. ఆరోగ్యం అస్సలు బాగాలేదని చెబుతుంది.. అసలు సమంతను నమ్మడం ఎలా? అనేదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు మయోసైటిస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత.. ఇప్పుడు ఉన్నట్టుండి బికినీ పిక్ షేర్ చేసి.. నేను రెడీ అని సిగ్నల్స్ ఇచ్చేసింది. ఇదే ఇప్పుడు సమంతను ట్రోల్ చేసేలా చేసింది. ప్రస్తుతం మలేషియాలో విహరిస్తున్న సమంత.. ఒకే ఒక్క ఒక్క బికినీ ఫోటోతో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దీంతో సామ్ ఈజ్ బ్యాక్ అని కొందరు అంటుంటే.. కొందరు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రతిసారీ తన సినిమాల ప్రమోషన్స్ సమయంలో మయోసైటిస్ గురించి ప్రస్థావిస్తూ.. సింపథీ కొట్టేస్తోందట సామ్. అంతేకాదు.. బికినీ ట్రీట్ చూశాక, అసలు సమంతకు ఆరోగ్య సమస్య ఉందా లేదా? అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
సినిమా రిలీజ్ అప్పుడే సమంత హెల్త్ గురించి చెబుతుంది.. కానీ మిగతా సమయాల్లో బాగానే ఉంటోంది కదా? అనే సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. కానీ సమంత మాత్రం మయోసైటిస్‌తో గట్టిగానే పోరాటం చేసింది. సినిమా కోసం అరుదైన వ్యాధి.. అంటూ ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది. ఇప్పుడిప్పుడే కోలుకున్న సమంత.. తాను పర్ఫెక్ట్గా ఉన్నాను.. ఫుల్ ఫిట్‌గా ఉన్నానని చెప్పడానికే.. బికినీ ట్రీట్ ఇచ్చిందని ఆమె అభిమానులు అంటున్నారు. కానీ.. సమంత మాత్రం విడాకుల తర్వాత చాలా స్ట్రగుల్ అయిందనే చెప్పాలి. ఇప్పుడిప్పుడే సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవడానికి ట్రై చేస్తోంది. అయినా కూడా.. సమంత పై ట్రోలింగ్ మాత్రం కామన్ అయిపోయింది.