»Teja Sajja Have You Seen Glimpses Of Teja Sajjas New Movie Mirai
Teja Sajja: తేజ సజ్జ కొత్త సినిమా మిరాయ్ గ్లింప్స్ చూశారా!
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేనితో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ మూవీ టీం గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూస్తుంటే గూస్బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి.
Teja Sajja: Have you seen glimpses of Teja Sajja's new movie Mirai!
Teja Sajja: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ఈ ఏడాది హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా అందరికీ నచ్చేసింది. తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. హనుమాన్ తర్వాత తేజ సజ్జ వరుస ఆఫర్స్‌తో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఈగల్ వంటి ఢిపరెంట్ సినిమాలను తెరకెక్కించిన తేజ కార్తీక్ ఘట్టమనేనితో తేజ సజ్జ ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు.
మూవీ టీం సినిమా టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను ఈరోజు విడుదల చేశారు. గ్లింప్స్ చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. కళింగ యుద్ధం తర్వాత యోగిగా మారిన అశోకుడు రహస్యంతో చిత్రం ప్రారంభం కాబోతుంది. ఈ గ్లింప్స్‌లో చూస్తే.. అశోకుడిని యోగిగా మార్చిన ఓ అపార గ్రంథం కోసం జరిగే పోరాటమే ఈ మూవీ స్టోరీ. తొమ్మిది గొప్ప గ్రంథాలతో సిద్ధం చేసిన ఈ అపార గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం కొందరు దుండగులు ప్రయత్నిస్తుంటారు.
ఆ గ్రంథాన్ని కాపాడటం కోసం ఒక యోధుడు ఉంటాడు. ఆ యోధుడు పాత్రనే తేజ సజ్జ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి మిరాయ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమా గ్లింప్స్ చూస్తే గూస్బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. కేవలం గ్లింప్స్ ఇలా ఉన్నాయంటే మరి సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హనుమాన్తో హిట్ కొట్టిన తేజ మిరాయ్ సినిమాతో మరో హిట్ సాధిస్తాడని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.