ఘట్టమనేని బ్రాండ్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. అయితే ఇటీవల వచ్చిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయాడు సుధీర్. అంతకుముందు వచ్చిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా కూడా అలరించలేకపోయింది. దాంతో సుధీర్ సాలిడ్ హిట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు(Sudheer Babu) తన 18వ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ప్లాన్ చేస్తున్నాడు. అది కూడా పీరియాడికల్ యాక్షన్ డ్రామాతో రాబోతున్నారు.
తాజాగా ఈ సినిమా టైటిల్ అండ్ కాన్సెప్ట్ లాంచ్ చేశారు. ‘హరోం హర’ అనే టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాను.. షెహరి సినిమా దర్శకుడు జ్ఞాన సాగర్ డైరెక్ట్ చేయబోతున్నారు. శ్రీ సుబ్రమణ్యం బ్యానర్స్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ కాన్సెప్టువల్ వీడియోలో.. చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రాంతంలో తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నేపథ్యంలో హరోం హర రానుందని ప్రకటించారు.
1989 బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. జగదాంబ టాకీస్‌లో సూపర్ స్టార్ కృష్ణ ‘అగ్నిపర్వతం’ మూవీ ఆడుతున్నట్టు చూపించారు. ఇక సెప్పెదేం లేదు.. చేసేదే.. అనే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. హరోం హర(Harom Hara) కాన్సెప్ట్ కూడా అదిరిపోయేలా ఉండడంతో.. ఇంతకు మందెన్నడు చూడని అవతార్‌లో సుధీర్ బాబు కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. మరి పాన్ ఇండియా రేంజ్లో రాబోతున్న నైట్రో స్టార్ ‘హరోం హరగా’ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.