ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే జక్కన్నతో తమ సినిమాను ప్రమోట్ చేయడానికి తహతహలాడుతుంటారు మూవీ మేకర్స్. ఈ క్రమంలో బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్రను గట్టిగానే ప్రమోట్ చేశాడు రాజమౌళి. అయితే అందుకోసం జక్కన్న అందుకున్న పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు రాజమౌళి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ మేకింగ్ చూసి హాలీవుడ్ సెలబ్రిటీస్ ఫిదా అయిపోయారు. అందుకే ఇప్పుడు రాజమౌళి అంటే ఓ బ్రాండ్‌గా మారిపోయింది.
అలాంటి బ్రాండ్ ఏదైనా సినిమాకు ప్రమోషన్స్ చేస్తే.. ఆటోమేటిక్‌గా జనాల్లో హైప్ క్రియేట్ అవుతుంది. అందుకే జక్కన్నను ముందు పెట్టి.. సౌత్‌లో బ్రహ్మాస్త్ర సినిమాను రిలీజ్ చేశాడు బాలీవుడ్ బడా దర్శక, నిర్మాత కరణ్ జోహార్. ఒక్క తెలుగు మాత్రమే కాదు.. మిగతా భాషల్లోను భారీగానే ప్రమోషన్స్ చేశాడు రాజమౌళి. అందుకు తగ్గట్టే భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బ్రహ్మాస్త్ర’కు భారీ వసూళ్లు దక్కాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో తాజాగా ‘బ్రహ్మాస్త్ర’ ప్రమోషన్స్‌కు రాజమౌళి షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర మేకర్స్ నుంచి దాదాపు 10 కోట్ల వరకు అందుకునట్టు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియకపోయినా.. కేవలం ఒక సినిమా ప్రొమోషన్స్ కోసం ఇన్ని కోట్లు అందుకోవడం.. రాజమౌళికే సాద్యమని చెప్పొచ్చు. ఏదేమైనా రాజమౌళి క్రేజ్ వేరే లెవల్ అని చెప్పొచ్చు.
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్షన్లో బాలీవుడ్ నుంచి వచ్చిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనిమల్.. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. 500 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఎంత రాబట్టిందంటే?