Mrunal Thakur : తెలుగు ఆడియెన్స్‌కు సీతగా చాలా దగ్గరైంది బలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠకూర్. సీతారమం సినిమాలో అమ్మడి అందానికి ఫిదా అయిపోయారు మనోళ్లు. అయితే 'సెల్ఫీ' అనే బాలీవుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో రెచ్చిపోయింది. సీత స్కిన్ షోకి కుర్రాళ్లు షాక్ అయ్యారు.
తెలుగు ఆడియెన్స్‌కు సీతగా చాలా దగ్గరైంది బలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠకూర్. సీతారమం సినిమాలో అమ్మడి అందానికి ఫిదా అయిపోయారు మనోళ్లు. అయితే ‘సెల్ఫీ’ అనే బాలీవుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో రెచ్చిపోయింది. సీత స్కిన్ షోకి కుర్రాళ్లు షాక్ అయ్యారు. సీతలో ఈ కోణం కూడా ఉందా అంటూ.. మృణాల్ గ్లామర్ షో చూసి పండగ చేసుకున్నారు. ఇక సీతారామం తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని సరసన ఛాన్స్ అందుకుంది. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. నాగార్జున అప్ కమింగ్ ఫిల్మ్లోను అమ్మడి పేరే వినిపిస్తోంది. అయితే మరో సీనియర్ హీరో వెంకటేష్‌తో దాదాపుగా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ‘హిట్’ ఫ్రాంచైజ్ డైరెక్టర్ శైలేష్ కొలనుతో కలిసి ‘సైంధవ్’ అనే సినిమా చేస్తున్నారు వెంకీ మామ. ఈ సినిమాలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఓ హీరోయిన్గా రుహాని శర్మ ఓకే అయిందని అంటున్నారు. ఇక తాజాగా మృణాల్ ఠాకూర్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫిషీయల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం యంగ్ హీరోలతో ఛాన్స్ అందుకుంటున్న మృణాల్.. సీనియర్ హీరోతో నటించేందుకు నిజంగానే ఓకే చెప్పిందా.. లేదా.. అనే డౌట్స్ వస్తున్నాయి. కాకపోతే సైంధవ్ సినిమాలో అమ్మడిది కీ రోల్ అని తెలుస్తోంది. అందుకే ఓకే చెప్పి ఉంటుందని అంటున్నారు. అలాగే కింగ్ నాగ్తోను అమ్మడు రొమాన్స్ చేయడం ఖాయమంటున్నారు.