»Singer Sunitha Interesting Comments About Director Krishnavamshis Rangamaarthanda
Singer Sunitha: సింగర్ సునీత కంటతడి..ఎమోషనల్ పోస్ట్ వైరల్
రంగమార్తాండ(Rangamarthanda) సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఈ మూవీ స్పెషల్ షో(Movie Special Show)ను సెలబ్రిటీలు వీక్షించారు. సినీ ప్రముఖులు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లు ఈ మూవీని చూశాక డైరెక్టర్ కృష్ణ వంశీ(Krishna Vamsi)ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇప్పటికే ఈ మూవీపై స్పందించారు. రంగమార్తాండ సినిమా చూస్తున్నంత సేపు తన కన్నీళ్లను ఆపుకోలేకపోయానని తెలిపారు.
టాలీవుడ్(Tollywood) డైరెక్టర్ కృష్ణవంశీ(Krishna Vamsi) ఏ సినిమా తెరకెక్కించినా అందులో సరికొత్త ప్రయోగం అనేది ఉంటుంది. ఈ విలక్షణ దర్శకుడు చాలా కాలం తర్వాత ‘రంగమార్తాండ'(Rangamarthanda) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో బ్రహ్మానందం, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. ఉగాది కానుకగా ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Video Player
Media error: Format(s) not supported or source(s) not found
రంగమార్తాండ(Rangamarthanda) సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఈ మూవీ స్పెషల్ షో(Movie Special Show)ను సెలబ్రిటీలు వీక్షించారు. సినీ ప్రముఖులు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లు ఈ మూవీని చూశాక డైరెక్టర్ కృష్ణ వంశీ(Krishna Vamsi)ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇప్పటికే ఈ మూవీపై స్పందించారు. రంగమార్తాండ సినిమా చూస్తున్నంత సేపు తన కన్నీళ్లను ఆపుకోలేకపోయానని తెలిపారు.
ఈ మూవీని చూసిన సింగర్ సునీత(Singer Sunitha) స్పందించారు. తాను సినిమా చూశాక తన గుండె బరువైపోయిందన్నారు. మనసంతా కూడా గుబులుగా ఉందని సింగర్ సునీత అన్నారు. సినిమాలోని మూడు క్యారెక్టర్స్ ఎంతో ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాయన్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం పెర్ఫార్మెన్స్ తో గుండె బరువయ్యిందన్నారు. ఇటువంటివి రెగ్యులర్ గా ఉంటే బయటపడేందుకు రకరకాల మార్గాలు వెతుకుతుంటామని, కానీ తనకు మాత్రం ఆ బరువు చాలా బాగా అనిపించిందని సింగర్ సునీత(Singer Sunitha) అన్నారు.
నటీనటుల నుంచి గొప్ప పెర్ఫామెన్స్ తీసుకురావడం డైరెక్టర్ కృష్ణవంశీ(Krishna Vamsi)కే సాధ్యమని సింగర్ సునీత ప్రశంసించారు. ఈ మూవీలో ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించే సన్నివేశాలు చాలానే ఉన్నాయని సునీత చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సునీత(Singer Sunitha) ఈ సినిమా చూసిన తర్వాత చేసిన ఎమోషనల్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.