రీరిలీజ్ లు మనకి కొత్త కాదు. పోకిరి దగ్గర మొదలుకొని, మొన్న వచ్చిన భారతీయుడు ఫస్ట్ పార్ట్ వరుకు ఒక్కో సినిమాని ఒక్క రకంగా ఆదరించారు మన తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు కెరీర్ లో క్లాసిక్ గా నిలిచినా మురారి వంతు వచ్చింది.
మహేష్ బాబు ని మొదటి సినిమా నుంచే ఫామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసింది రాజకుమారుడు. తరువాత మురారి సూపర్ హిట్ అవ్వడంతో పాటు మహేష్ కి ఫామిలీ ఆడియన్స్ హృదయాల్లో గట్టి పునాదే పడింది. ఈ సినిమా లో ఫామిలీ ఎమోషన్స్, మ్యూజిక్, గోదావరి జిల్లాల వెటకారం ఇంకా ప్రేక్షకులకు అనిపిస్తుంది.
ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్డే. ప్రతీ పుట్టినరోజుకి ఫ్యాన్స్ కి ఇదొక సినిమా అప్డేట్ ఇవ్వడం మహేష్ కి అలవాటు. ఈసారి ఫ్రెష్ అప్డేట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే చేయబోయేది రాజమౌళి సినిమా. ఆ ప్రాజెక్ట్ గురించి ఏ న్యూస్ బయటకి రివీల్ చేయాలన్న ఆయన ఓకే చెప్పాల్సిందే. కాబట్టి మహేష్ – రాజమౌళి సినిమా సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉండదనే క్లారిటీ అభిమానులకు వచ్చేసింది
కానీ మహేష్ ఫ్యాన్స్ బాధ పడేలోపే మురారి రూపంలో వారికి ఒక ఎమోషన్ దొరికింది. మురారి 4K వెర్షన్ తో రీరిలీజ్ న్యూస్ తో వాళ్ళు ఫుల్ ఖుషీగా ఉన్నారు. దానికి ఆ సినిమా సాంగ్స్ ఒక మెయిన్ రీసన్. మహేష్ ఫ్యాన్స్ తో గత రెండు రోజులుగా తన కృష్ణ వంశీ. మురారి జరిగిన సంఘటనలు, మహేష్ పెర్ఫార్మన్స్ గురించి, అప్పుడు జరిగిన బిజినెస్ గురించి సోషల్ మీడియా ద్వారా ఆయన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు.
ఇప్పటివరకు మహేష్ బాబు సినిమాల్లో పోకిరి, ఒక్కడు, బిజినెస్ మేన్ సినిమాలు రి రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు రాబట్టాయి. మురారి కూడా ఆ లిస్ట్ చేరడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్