టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ‘బొమ్మరిల్లు’ సినిమా(Bommarillu Movie) చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో హీరో సిద్దార్థ్(Hero Siddarth) చెరగని ముద్ర వేసుకున్నారు. తాజాగా ఆయన ‘టక్కర్’ మూవీ(Takkar Movie)తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. కార్తీక్ జి.క్రిష్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో దివ్యాంశ కౌశిక్(Divyansha kaushik) కథానాయికగా నటించింది. జూన్ 9న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ‘టక్కర్’ మూవీ నుంచి పోస్టర్లు, టీజర్, ట్రైలర్, సాంగ్స్ విడుదలైన సంగతి తెలిసిందే. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా హీరో సిద్దార్థ్(Hero Siddarth) విలేకర్లతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. టక్కర్ మూవీ(Takkar Movie) ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణ చుట్టూ తిరుగుతుందన్నారు. డబ్బు సంపాదించాలనే కోరికతో హీరో కిడ్నాపర్‌గా మారే పరిస్థితులను కథాంశంగా తీసుకుని సినిమా చేసినట్లు తెలిపారు. కొడుకు, తల్లి మధ్య సాగే కీలకమైన డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకుంటాయన్నారు. ఇతర భాషలతో పోలిస్తే తెలుగు సినిమా పరిశ్రమకు ఉన్న ప్రత్యేకత వేరన్నారు.
గతంలో దర్శకులు ఓ సినిమా చేయడానికి తక్కువ కాలం పట్టేదని ఇప్పుడు నాలుగు ఏళ్లు పడుతోందన్నారు. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాను కచ్చితంగా ఆదరిస్తారన్నారు. తెలుగు సినిమాలు చేయడానికి ప్రత్యేకమైన కారణమేమీ లేదన్నారు. భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాను తాను ఎప్పుడూ తిరస్కరించనని అన్నారు. ప్రతిభ, యోగ్యత ఉంటే కచ్చితంగా వరుస అవకాశాలు వస్తాయన్నారు. తననుత ఆదరించి ఈ స్థాయికి తీసుకొచ్చిన తెలుగు ప్రేక్షకులకు హీరో సిద్దార్థ్(Hero Siddarth) ధన్యవాదాలు తెలిపారు.
టక్కర్ మూవీ(Takkar Movie) తర్వాత తన సొంత నిర్మాణ సంస్థలో చిన్నా అనే సినిమా చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇండియన్2 సినిమాలో కూడా నటిస్తున్నానని తెలిపారు. మాధవన్, నయనతారతో టెస్ట్ అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. కార్తీక్ క్రిష్‌తో మరోసారి పనిచేయనున్నట్లు సిద్దార్థ్(Hero Siddarth) తెలిపారు.