Indian 2: 8 వేల మందితో షూటింగ్..ఏం ప్లాన్ చేస్తున్నావ్ శంకర్?
స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శంకర్ సినిమాలంటేనే..వందల కోట్ల బడ్జెట్, వందల మంది సెట్స్‌లో ఉండాల్సిందే. ఇప్పుడు ఇండియన్ 2 సినిమా కోసం ఏకంగా 8వేల మందిని రంగంలోకి దింపాడట శంకర్.
స్టార్ డైరెక్టర్ శంకర్(shankar) గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా సరే.. చాలా గ్రాండియర్‌గా తెరకెక్కించడం శంకర్ స్టైల్. ఓ సినిమా కోసం వందల కోట్లు ఖర్చు చేయడం, వేల మందితో షూటింగ్ చేయడం శంకర్‌కే చెల్లింది. ప్రస్తుతం గేమ్ చేంజర్, ఇండియన్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు శంకర్. ఈ రెండు సినిమాలను కూడా భారీగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఇండియన్2 షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. లేటెస్ట్గా ఇండియన్ 2 షూటింగ్ ఏపిలో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఓ భారీ సీక్వెన్స్ చిత్రీకరించనున్నాడట శంకర్.
అందుకోసం ఏకంగా 8 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లను రంగంలోకి దింపినట్టు సమాచారం. విజయవాడ(vijayawada)లోని గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారట. మొత్తం నాలుగు రోజుల పాటు షూటింగ్ జరగనుందట. అయితే.. అన్ని వేలమందితో షూటింగ్ అనేసరికి.. అసలు శంకర్ ఏం ప్లాన్ చేస్తున్నాడనేది అంతుపట్టకుండా ఉంది. ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటిస్తుండగా.. సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని కీ రోల్ ప్లే చేస్తున్నారు. రీసెంట్గా ఇండియన్ 2 ఇంట్రో పేరుతో రిలీజ్ చేసిన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఖచ్చితంగా భారతియుడు లాగే ఈ సినిమా కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. మరి ఇండియన్ 2 ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.