2018 Movie: బ్రేకింగ్.. ఆస్కార్స్‌కు సెన్సేషనల్ హిట్ ‘2018’
కొన్ని సినిమాలు ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర అద్భుతం చేస్తుంటాయి. సమ్మర్లో రిలీజ్ అయిన మళయాళ బ్లాక్ బస్టర్ 2018 సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఆస్కార్ ఎంట్రీకి చోటు దక్కించుకుంది.
టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళ మూవీ 2018 కేరళ బాక్సాఫీస్‌ని షేక్ చేసేసింది. కేవలం 30 కోట్ల బడ్జట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. 200 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ఈ సినిమాను గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పైన బన్నీ వాసు డబ్బింగ్ చేసి రిలీజ్ చేశాడు. అంతంత మాత్రమే ప్రమోషన్స్‌తో థియేటర్లోకి వచ్చిన 2018 మూవీకి.. తెలుగు సినీ అభిమానులు భారీ విజయాన్ని ఇచ్చారు. దాంతో భారీ లాభాలను తెచ్చిపెట్టింది. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎమోషనల్ డ్రామాకు ఆడియెన్స్ చాలా కనెక్ట్ అయిపోయారు.
చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమాను.. ఆంటోని జోసెఫ్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ఆస్కార్ ఎంట్రీ దక్కించుకుంది. భారతదేశం అకాడమీ అవార్డ్స్ 2024 రేసులో బలగం, ది కేరళ స్టోరీ, జ్విగాటో, రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ వంటి చిత్రాలు పోటీలో ఉన్నాయి. ఫైనల్‌గా భారతదేశం నుంచి మలయాళ చిత్రం ‘2018’, 2024 అకాడమీ అవార్డ్స్ కోసం భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపిక చేయబడింది.
96వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా పరిగణించబడటానికి ఎంపిక చేయబడింది. కన్నడ చిత్ర దర్శకుడు గిరీష్ కాసరవల్లి నేతృత్వంలోని జ్యూరీ ఈమేరకు ఈ రోజు నిర్ణయం ప్రకటించింది. వచ్చే ఏడాది ఆస్కార్స్‌లో భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం వహించే ఉత్తమ చిత్రం 2018 అని జ్యూరీ నిర్ణయించింది. ఇక ఈ ఏడాదిలో ట్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి 2018 ఆస్కార్ రేసులో ఎంత వరకు నిలబడుతుందో చూడాలి.