Second single from Vijay Deverakonda's 'Family Star'
The Family Star: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో పరశురాం దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. తాజాగా ఈ మూవీ నుంచి రెండో పాట విడుదలైంది. కల్యాణి వచ్చా వచ్చా అంటూ సాగే ఈ గీతానికి గోపిసుందర్ మ్యాజిక్ అందించగా, అనంత్ శ్రీరామ్ సాహిత్యం ఇచ్చారు. ఈ పాటను కార్తీక్, మంగ్లి ఆలపించారు. ఈ లిరికల్ పాట యూట్యూబ్లో విడుదల అయింది. ఫ్యామిలీ స్టార్ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.