ప్రస్తుతం సమంత కండీషన్ ఎలా ఉందోనని ఆందోళన పడుతున్నారు ఆమె అభిమానులు. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్.. యశోద సినిమా ప్రమోషన్లో భాగంగా కన్నీటి పర్యతంమైన సంగతి తెలిసిందే. అప్పుడే సమంత ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే ఆ తర్వాత సామ్ ఎలా ఉంది.. ఆమె ఆరోగ్యం కుదుట పడిందా.. అని ఆరా తీస్తున్నారు.
కానీ ఆమె హెల్త్ అప్టేట్ మాత్రం బయటికి రావడం లేదు. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గతంలో అమెరికాలో ట్రీట్మెంట్ చేసుకున్న సామ్.. ఆ తర్వాత ఇండియాకి వచ్చి చికిత్స చేయించుకుంది. అయితే రీసెంట్గా ఆయుర్వేద వైద్యం కోసం కేరళకు వెళ్లిందని తెలిసింది. కానీ ఇప్పుడు సమంత కండీషన్ మరింత సీరియస్గా ఉందనే వార్తలు వస్తున్నాయి. అంతేకాదు మెరుగైన వైద్యం కోసం దక్షిణ కొరియాకు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.
అక్కడ ఆ వ్యాధికి అత్యంత ఆధునిక, సంప్రదాయ వైద్యం అందుబాటులో ఉందట.. అందుకే సమంత దక్షిణ కొరియాకు వెళ్లినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో.. ఆమె పరిస్థితి రోజురోజుకు సీరియస్గా మారుతోందా.. అనే సందేహాలు వెలువడుతున్నాయి. దాంతో ఆమె అభిమానులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
అయితే ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. అలాగే సామ్ కండీషన్ గురించి అధికారిక ప్రకటన కావాలంటున్నారు అభిమానులు. మరి ఇప్పటికైనా సామ్ సన్నిహితులు దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.