కెజియఫ్ సిరీస్ చూసిన తర్వాత సలార్ సినిమా ఇంకెలా ఉంటుందోనని.. ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు అభిమానులు. పైగా ప్రభాస్ కటౌట్‌ను ప్రశాంత్ నీల్ ఇంకెలా ఎలివేట్ చేస్తున్నాడోనని.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న సలార్ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాంతో వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే ఈ మూవీ చాలా భాగం షూటింగ్ జరుపుకుంది. త్వరలోనే మరో షెడ్యూల్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ షెడ్యూల్ సినిమాలో చాలా కీలకం అని తెలుస్తోంది. సలార్‌లో మళయాళ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన హీరో మాత్రమే కాదు టాలెంటెడ్ డైరెక్టర్ కూడా.. అలాంటి వ్యక్తి సలార్ సినిమాను నెక్స్ట్ లెవల్ అంటున్నాడంటే.. ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ ఈసారి ఊహకందని విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడని చెప్పొచ్చు. తాజాగా పృధ్వీరాజ్ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తనది నెగిటివ్ షేడ్స్ రోల్ అయినా.. చాలా డిఫరెంట్‌గా ఉంటుందని అంటున్నాడు. అలాగే ప్రభాస్ తన మధ్య వచ్చే సీన్స్ పీక్స్‌లో ఉంటాయని.. ఆ సీన్లు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని అంటున్నాడు. వచ్చే నెలలో ప్రభాస్‌తో కలిసి షూటింగ్లో జాయిన్ అవనున్నాడని చెప్పాడు. ఈ షెడ్యూల్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నాడు. మరి అంచనాలు పెంచేస్తున్న సలార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.