సలార్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుండటం వల్లే.. మేకర్స్ ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదా? అనే డౌట్స్ రాక మానదు. ఎందుకంటే.. సలార్ రిలీజ్‌కు మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా కూడా హోంబలే ఫిలింస్ వారు సైలెంట్‌గా ఉన్నారు.
Salaar: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ సలార్ (Salaar) రిలీజ్‌కు పట్టుమని పది రోజులు కూడా లేవు. ఇప్పటి వరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు మేకర్స్. ప్రశాంత్ నీల్ ఎక్కడో ఓ చోట వెబ్ ఇంటర్య్వూలు తప్పితే.. ఇంకా కెమెరా ముందుకు రాలేదు. సలార్ పై (Salaar) ఎంత హైప్ ఉన్నా.. ప్రభాస్ ప్రమోషన్స్ చేయకపోతే పాన్ ఇండియా లెవల్లో ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. అందుకే.. ప్రమోషన్స్ విషయంలో అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు. కానీ ప్రశాంత్ నీల్ అసలు ప్లాన్ ఏంటనేది అర్థం కావడం లేదు. పది రోజుల్లో రిలీజ్ ఉన్నా కూడా ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు.. అసలు ప్రీరిలీజ్ ఈవెంట్ ఉంటుందో లేదో కూడా క్లారిటీ ఇవ్వడం లేదు.
చివరగా ఆదిపురుష్ ఈవెంట్లో కనిపించిన ప్రభాస్.. ఇప్పటివరకు మరో పబ్లిక్ మీటింగ్‌లో కనిపించలేదు. దీంతో ప్రభాస్ ఈసారైనా బయటికి వస్తాడా? కనీసం ఒకటి రెండు ఇంటర్య్వూలు అయినా ఇస్తాడా? పోనీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన ఉంటుందా? అనేది తెలియకుండా పోయింది. ప్రస్తుతానికైతే.. సలార్ మేకర్స్ ప్రమోషన్స్ తీరు ఆశ్చర్యంగానే ఉంది. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే అప్డేట్స్ ఇస్తున్నారు. ప్రమోషన్స్ చెయ్యకపోయినా సలార్ సినిమా పై హైప్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ క్రేజ్‌తోనే సినిమా ప్రమోట్ అవుతుంది సలార్. అందుకే ప్రమోషన్స్ చేయడం లేదా? అనే డౌట్స్ వస్తున్నాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి ఒక్క ఇంటర్వ్వూ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే చాలు.. సలార్ హైప్ పీక్స్‌కు వెళ్లిపోతుంది. కాబట్టి.. రేపో మాపో డైనోసర్ ఎంట్రీ ఉంటుందనే చెప్పాలి.