»Sai Pallavis Sister Pooja Reveals Her Life Partner And Plans For Soon To Be Marriage
Sai Pallavi: పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్ చెల్లి
ఇండిస్ట్రీలో హీరోయిన్స్ ఫామ్’లో ఉన్నప్పుడు వాళ్ల చెల్లెళ్లు పెళ్లి చేసుకోవడం కామన్, ఈ నేచురల్ బ్యూటీ సిస్టర్ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని వార్తలు వస్తున్నాయి.
Sai Pallavi’s Sister Pooja Reveals Her Life Partner and Plans for Soon-to-Be Marriage
Sai Pallavi: సినీ పరిశ్రమలో హీరోయిన్’గా కొనసాగుతున్నవారు తొందరగా పెళ్లి చేసుకోరు. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే అక్కడితో వాళ్ల కెరీర్ ఆగిపోయినట్లే అనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే..కనీసం 30 బోర్డర్ కి రానిది పెళ్లి ఊసు ఎత్తరు. కానీ.. వాళ్లకు చెల్లెళ్లు ఉంటే.. వాళ్లు మాత్రం పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతూ ఉంటారు. చాలా మంది విషయంలో ఇది జరిగింది. సినీ పరిశ్రమలో నటీమణుల చెల్లెళ్లు ముందుగా పెళ్లి చేసుకోవడం మామూలే. తాజాగా కాజల్ అగర్వాల్ ఫ్యామిలీలో కూడా అదే జరిగింది. నటీమణులు తమ కెరీర్లో బిజీగా ఉన్నందున, వారు పెళ్లి చేసుకోవడానికి సమయం తీసుకుంటారు. ఇప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఫ్యామిలీలోనూ అదే జరిగుతోంది.
సాయి పల్లవి గురించి తెలియని వారు ఉండరు. సాయి పల్లవి సౌత్ ఇండియన్ సినిమాలో అత్యంత ఇష్టపడే నటీమణులలో ఒకరు. తాజాగా సాయిపల్లవి చెల్లెలు పూజ పెళ్లి చేసుకోబోతుంది. పండగ సందర్భంగా పూజా కన్నన్ తన ప్రియుడిని పరిచయం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పూజా కన్నన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న ఫోటో , వీడియోను పోస్ట్ చేసింది. పూజా కన్నన్ చెప్పిన మాటలు విన్న సాయి పల్లవి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సాయి పల్లవికి చెల్లేలు పూజా కన్నన్. సోదరీమణులు తరచూ తమ ఇద్దరి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు కూడా సాయి పల్లవి తన చెల్లెలితోనే ఎక్కువగా కనిపిస్తుంది. తమిళంలో పూజా కన్నన్ ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ‘చిత్తిరి సేవనం’లో నటించింది. ఇందులో సముద్రఖని, రీమా కల్లింగల్ ,ఇతరులు కూడా నటించారు. అయితే, ఇప్పుడు పూజా తన గురించి వెల్లడించిన పోస్ట్ వైరల్ అవుతోంది. కొందరేమో.. చెల్లి పెళ్లి చేసుకుంటోంది అంటే.. సాయిపల్లవి పెళ్లి చేసుకోదా అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ.. సాయిపల్లవి కెరీర్ ప్రస్తుతం అద్బుతంగా ఉంది. ఆమె చేతిలో చాలా మంచి సినిమాలు.. ఈ సమయంలో పెళ్లి కి దూరంగా ఉండటం సహజం. అలా అని తన పెళ్లి కోసం తన చెల్లి పెళ్లి ఆపడం కరెక్ట్ కాదని వారు భావించి ఉండొచ్చు.