»Sankranthi 2025 Is Packed With Chiranjeevi And Other Films
Sankranthi 2025: వచ్చే సంక్రాంతికి కూడా సినిమా ఫిక్స్..!
సంక్రాంతికి సినిమాలకు విడదీయలేని బంధం ఉంది. ఎన్ని చిత్రాలు విడుదలైనా ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. అయితే వచ్చే సంవత్సరం సంక్రాంతికి వచ్చే సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
Sankranthi 2025 is packed with Chiranjeevi and other films
Sankranthi 2025: ఈ ఏడాది సంక్రాంతికి అన్ని సినిమాలు గట్టిగానే పోటీ ఇచ్చాయి. అన్నింట్లోనూ హనుమాన్ టాప్ గా నిలిచింది. తర్వాత నాగార్జున నాసామిరంగ కి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. గుంటూరుకారం, సైంధవ్ మాత్రం కాస్త వెనకపడ్డాయి.అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల జాబితా కూడా ఇప్పుడే బయటకు వచ్చేసింది. ఆ సినిమాలేంటో చూద్దాం…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగా156 అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ పోటీలో చాలా చిత్రాలు ఉన్నాయి. శతమానం భవతికి సీక్వెల్‌ను దిల్ రాజు ప్రకటించారు. 2017లో శతమానం భవతి సాధించిన అద్భుతమైన విజయానికి కృతజ్ఞతలు తెలుపుతూ SVC బ్యానర్ ఖ్యాతిని గణనీయంగా పెంచింది. ఖైదీ నంబర్ 150 , గౌతమీపుత్ర శాతకర్ణి వంటి పెద్ద చిత్రాలతో పోటీ పడినప్పటికీ 2017 సంక్రాంతి సందర్భంగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక “శతమానం భవతి నెక్స్ట్ పేజి” అనే సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం 2025 సక్రాంతికి విడుదల కానుంది. వీటితో పాటు PVCU2 – ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ 2వ చిత్రం. అక్కినేని నాగార్జున బంగార్రాజు 3 చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. దీంతో వచ్చే సంక్రాంతి సినిమాలకు అత్యంత క్రేజీ సీజన్‌గా మారనుంది.