Sai Dharam Tej: టాలీవుడ్ మెగా నటుడు సాయి ధరమ్ తేజ్ కొత్త బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నారు. విజయ దుర్గ ప్రొడక్షన్స్ పేరుతో సినీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని తేజ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తేజ్‌కు అమ్మ అంటే ఎంతో ఇష్టం. ఎంతో ఇష్టమైన అమ్మ విజయ దుర్గ పేరిట ఈ ప్రొడక్షన్ ప్రారంభిస్తున్నట్లు తేజ్ తెలిపాడు. ఈ ప్రోడక్షన్ సంస్థ ద్వారా కొత్త తరం ఆలోచలను, కంటెంట్‌ను ప్రోత్సహిస్తానని తెలిపాడు.
A New beginning ☺️
Happy to announce a small gift to my mother on her name, Our Production House @VijayaDurgaProd 🥳
మామయ్యలు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఈ ప్రోడక్షన్ హౌస్ ప్రారంభించానని తేజ్ తెలిపారు. ఇక నా కెరీర్ మొదట్లో నాకు సహకరించిన నిర్మాత దిల్‌రాజు. అలాగే నా బెస్ట్ ఫ్రెండ్స్‌తో చేసిన ‘సత్య’ సినిమా టీమ్‌తో దీన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందంటూ సాయిథరమ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.