'నేను స్టూడెంట్ సార్' మూవీ(Nenu Student Sir Movie) నుంచి రన్ రన్ (RUN RUN Lyrical) అంటూ సాగే ర్యాప్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్(Release) చేశారు. మహతి స్వరసాగర్ ఈ పాటను కంపోజ్ చేశారు.
స్వాతి ముత్యం(Swathimutyam Movie) హీరో బెల్లంకొండ గణేశ్ (Bellamkonda Ganesh) తాజాగా ‘నేను స్టూడెంట్ సర్’ (Nenu Student Sir) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీకి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం(Director Rakhi Uppalapati) వహిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో అలనాటి అందాల తార భాగ్య శ్రీ కూతురు అవంతిక దస్సానీ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మాయే మాయే, 24/7 ఒకటే ధ్యాస లిరికల్ వీడియో సాంగ్స్ విడుదలయ్యాయి.
‘నేను స్టూడెంట్ సర్’ నుంచి రన్ ర్యాప్ సాంగ్:
తాజాగా ‘నేను స్టూడెంట్ సార్’ మూవీ(Nenu Student Sir Movie) నుంచి రన్ రన్ (RUN RUN Lyrical) అంటూ సాగే ర్యాప్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్(Release) చేశారు. మహతి స్వరసాగర్ ఈ పాటను కంపోజ్ చేశారు. అసుర ఈ పాటను పాడాడు. ఈ సినిమాను జూన్ 2వ తేదిన విడుదల చేయనున్నారు. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన కొత్త లుక్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ చిత్రంలో సముద్రఖని(Samudrakhani) పోలీస్ ఆఫీసర్ అర్జున్ వాసుదేవన్‌గా నటిస్తున్నారు. మూవీలో సునీల్(sunil) కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, చరణ్ దీప్, ఆటో రాంప్రసాద్, ప్రమోదిని వంటివారు ఈ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాంది ఫేం సతీశ్ కుమార్ రూపొందిస్తున్నారు. ఈ మూవీకి కృష్ణ చైతన్య కథను అందించాడు.