ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ మూవీకి.. ఈ సారి ఆస్కార్ రావడం పక్కా అంటున్నాయి కొన్ని హాలీవుడ్ ప్రిడిక్షన్స్. దాంతో దర్శక ధీరుడు ఆస్కార్ ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నాడు. అందుకోసం భారీగానే ఖర్చు చేస్తున్నట్టు టాక్. ఎట్టి పరిస్థితుల్లోను వచ్చే ఆస్కార్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ను నిలపడమే లక్ష్యంగా రాజమౌళి ట్రై చేస్తున్నారు.
ఇప్పటికే పలు క్యాటగిరీల్లో ఆర్ఆర్ఆర్ను ఆస్కార్‌కు పంపించేందుకు క్యాంపెయిన్ మొదలైపోయింది. ఇండియన్ అకాడమీ వారు ఈ సినిమాను ఆస్కార్‌కు పంపకపోయినా.. చిత్ర యూనిట్ పలు కేటగిరీలలో ఆస్కార్ కోసం ట్రై చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా.. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అప్టేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఆర్ఆర్ఆర్ బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్స్‌ని దక్కించుకునే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మారింది. దాంతో ఈ సారి ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవడం ఖాయమంటున్నారు. ఇకపోతే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన ఈ సినిమాను.. ఇటీవలె జపాన్‌లో కూడా రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్టే ప్రమోషన్స్ కూడా చేసింది ఆర్ఆర్ఆర్ యూనిట్.
మొత్తంగా జపాన్ ప్రేక్షకులకు ఈ మూవీ విపరీతంగా నచ్చడంతో.. రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు రాజమౌళి. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ఒకవేళ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకుంటే మాత్రం.. మహేష్ సినిమా అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు వెళ్లడం ఖాయం.