టెలివిజన్ షోస్ ద్వారా ఎంతోమంది నటులు పరిచయమయ్యారు. వారిలో చాలామంది స్టార్ కమెడియన్స్ రేంజ్ కి ఎదిగారు. పాత రోజుల్లో దూరదర్శన్, నేటితరం నటులకు యూట్యూబ్, ఓటీటీ, కామెడీ షోస్ లాంటి వేదికలు ఉపయోగపడ్డాయి. గత పదేళ్లలో చూస్తే ఈటీవీ ద్వారా మల్లెమాల సంస్థ చేస్తున్న జబర్దస్త్ కామెడీ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. ఇందోలో ఏ మాత్రం డౌట్ లేదు
ఈ షో ప్రారంభం అయినప్పటి నుంచి వేణు, ధనరాజ్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, సన్నీ, రాకేష్, చమ్మక్ చంద్ర ఇలా బుల్లితెర నుండి సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన నటులు ఎంతోమంది ఉన్నారు. రష్మీ, అనసూయ లాంటి వారికి సినిమా ఆఫర్లు చాలానే వచ్చాయి. వీళ్లందరికంటే హైపర్ ఆది ఒక సెపరేట్ ఫ్యాన్ బేసును సంపాదించుకున్నాడు. తాను ఒక స్కిట్ రైటర్ గా జబర్దస్త్ కు పరిచయమయ్యి, టీమ్ లో చోటు సంపాదించుకుని, తరువాత టీం లీడర్ గా ఎదిగి ప్రస్తుతం చేతినిండా సినిమాలు, టెలివిషన్ షోస్ తో బిజీ గా ఉన్నాడు.
ఆది తన బిజీ షెడ్యూల్ వాళ్ళ జబర్దస్త్ ను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆదితో పాటు రీతూ చౌదరి కంబినేషన్ జబర్దస్త్ లో బాగా పేలింది. రీసెంట్ గా ఆమె ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో జబర్దస్త్ వదిలేయడానికి గల కారణం అడిగితే హైపర్ ఆది వల్లే వదిలేసాను అని చెప్పుకొచ్చింది. హైపర్ ఆది వెళ్ళిపోయాక తాను జబర్దస్త్ లో ఒంటరినయ్యాను అనే ఫీలింగ్ వచ్చింది. నాతోపాటు ఎవరు లేరు, కాబట్టి నేను కూడా బయటకు వచ్చాను అని చెప్పుకొచ్చింది. రీతూ చౌదరి కూడా అంచలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు మంచి ఆఫర్స్ తో బిజీ గ ఉంది.