నటీనటులు – బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, రావు రమేష్, సురేఖ వాణి, వి.కె.నరేష్, సుబ్బరాజు రచన, దర్శకత్వం – లక్ష్మణ్ కె కృష్ణ నిర్మాత – సూర్యదేవర నాగ వంశీ సంగీతం – మహతి స్వర సాగర్
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ నటించిన తొలిచిత్రం స్వాతిముత్యం ఈరోజు (అక్టోబర్ 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరోవైపు చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది ఘోస్ట్ మూవీలతోపాటు ఈ సినిమా విడుదల కావడం విశేషమనే చెప్పాలి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఈ సినిమాపై మరింత బజ్ ను క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా స్టోరీ ఎంటో ఇప్పుడు చుద్దాం.
కథ
అమాయకుడైన పల్లెటూరు హీరో, సీటీ అమ్మాయి మధ్య జరిగే రొమాంటింక్ లవ్ స్టోరీని స్వాతిముత్యం సినిమాగా తెరకెక్కించారు. సరికొత్త అంశాలను గుర్తు చేస్తూ ఫన్నీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా రూపొందించారు. ప్రేక్షకులు పక్కాగా అస్వాదించే చిత్రమని చెప్పవచ్చు. మొత్తం కథ తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
హీరో బెల్లకొండ గణేష్ కు ఈ సినిమా మొదటిదే అయినా యాక్టింగ్ విషయంలో మెప్పించాడని చెప్పవచ్చు. కొన్ని సీన్లలో హీరో ఇబ్బందిపడినట్లు అనిపించినా..మొత్తానికి తన క్యారెక్టర్ కు న్యాయం చేశాడని చెప్పొచ్చు. మరోవైపు హీరోయిన్ వర్ష తన ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టింది. ఇప్పటికే పలు సినిమాల్లో యాక్ట్ చేసిన వర్ష..ఈ మూవీలో తన యాక్టింగ్ పర్ఫామెన్స్ పెంచుకుంది. ఇక వెన్నెల కిషోర్, రావు రమేష్, సుబ్బరాజు, నరేష్ లు తమ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక అంశాలు
ఫ్యామిలీ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి నవీన్ నూలి చేసిన ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీలో సూర్య కూడా తన పనికి న్యాయం చేశాడు. ఇక మహతి సాగర్ ట్యూన్స్, బ్యాగ్ రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపిస్తుంది. డైరెక్టర్ తీసిన కొన్ని సన్నీవేశాల్లో మంచి కామెడీ పండించారు. మరికొన్ని చోట్ల ఎమోషనల్ సీన్స్ కూడా చొప్పించారు.
చివరిగా
ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ, మంచి కామెడీ కూడా ఉంది. దీంతో ఈ చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులతోపాటు యూత్ ను కూడా ఆకట్టుకుంది. ఈ దసరాకు కుటుంబంతోపాటు నవ్వుకునే చిత్రం వచ్చింది. అంతేకాదు ఈ మూవీ చూస్తున్నప్పుడు కొత్త హీరో ఫస్ట్ సినిమాలాగా అనిపించలేదని పలువురు అంటున్నారు.