»Responding To The Liger Exhibitors Dharna Charmy Promised To Do Justice
Charmy: ‘లైగర్’ ఎగ్జిబిటర్ల ధర్నాపై స్పందించిన ఛార్మీ..న్యాయం చేస్తానని హామీ
ఫిల్మ్ ఛాంబర్ వద్ద చేపట్టిన ఈ రిలే నిరాహార దీక్షలో ఎగ్జిబిటర్లు తమ డిమాండ్లను వినిపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై సినీ నటి, లైగర్ ప్రొడ్యూసర్ చార్మీ(Charmy) స్పందించారు.
టాలీవుడ్(Tollywood) హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన లైగర్ సినిమా(Liger Movie) పరాజయం పాలైన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కింది. అయినప్పటికీ తీవ్ర నష్టాలను చవిచూసింది. అటు నిర్మాతలకు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. లైగర్ మూవీ వల్ల నష్టపోయిన వారికి సెటిల్ చేస్తానని గతంలో పూరీ జగన్నాథ్(Puri Jagannadh) తెలిపాడు.
తాజాగా నైజాం ఏరియా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆందోళన చేశారు. లైగర్ సినిమా(Liger Movie) వల్ల తమకు భారీ నష్టం వచ్చిందని, తమను ఆదుకోవాలని కోరుతూ వారు నిరసన చేపట్టారు. ఆర్థికంగా నష్టపోయిన తమకు పూరీ జగన్నాథ్(Puri Jagannadh) ఆదుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఎగ్జిబిటర్స్ అండ్ లీజర్స్ అసోసియేషన్ సభ్యులు నేటి నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
ఫిల్మ్ ఛాంబర్ వద్ద చేపట్టిన ఈ రిలే నిరాహార దీక్షలో ఎగ్జిబిటర్లు తమ డిమాండ్లను వినిపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై సినీ నటి, లైగర్ ప్రొడ్యూసర్ ఛార్మీ(Charmy) స్పందించారు. ఎగ్జిబిటర్ల నిరసన తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే వారికి అనుకూలంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ కు ఆమె మెయిల్ ద్వారా సందేశాన్ని పంపగా అందులో ఎగ్జిబిటర్లకు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నట్లు తెలిపారు.