Tollywood : సుమన్ కూతురు ఓ స్టార్ హీరో ఇంటి కోడలిగా వెళ్లనుందా..? క్లారిటీ ఇచ్చారుగా
ఒకప్పటి అగ్రహీరో సుమన్ తన కుటుంబం, జైలు జీవితం, ఆయన కూతురు పెళ్లి గురించి మొదటి సారిగా మీడియా ముందు మాట్లాడారు. అయితే తన కూతరు పెళ్లి గురించి స్పష్టతను ఇచ్చారు.
హీరో సుమన్ 45 ఏళ్లుగా నటుడిగా సత్తాచాటుతున్నారు. ఒకప్పుడు చిరంజీవికి పోటీగా అటు డ్యాన్సుల్లో, నటనలో తీవ్రమైన పోటీనిచ్చారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రాణించిన సుమన్ 90వ దశకంలో అగ్రహీరోగా రాణించారు. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన సుమన్ స్వతహాగా కరాటే బ్లాక్ బెల్ట్ హోల్డర్. తాజాగా ఆయన ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ… ఆయన జైలు జీవితం, ఫ్యామిలీ గురించి పంచుకున్నారు.
“నా ప్రమేయం లేకున్నా నన్ను జైలులో వేశారు. ఇండస్ట్రీలోని హీరోయిన్లు కూడా నేను ఇలాంటి చీప్ పనులు చేయనని బహిరంగంగానే చెప్పారు. అందులో సుహాసిని, సుమలత ఉన్నారు. అది నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నా కూతురు అఖిలజ ప్రత్యూష విషయానికి వస్తే తనకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదు. తను రెండేళ్ల క్రితమే మణిపాల్ యునివర్సిటీలో హ్యూమన్ జెనిటిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించింది. సౌత్ ఇండియాలోని ఓ స్టార్ హీరో ఇంటికి కోడలిగా నా కూతురు వెళ్తుందని పుకార్లు వస్తున్నాయి. అందులో నిజం లేదు. ఆమెకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాము కానీ ఇప్పడు కాదు. సమయం వచ్చినప్పుడు జరుగుతుంది. చదువు పూర్తయ్యాకే పెళ్లి గురించి ఆలోచిస్తాం” అని అన్నారు సుమన్.
1985లో సుమన్ జైలు పాలయ్యారు. ఆయన స్నేహితుడు దివాకర్ అనే వ్యక్తికి సినిమా క్యాసెట్లు రెంటుకు ఇచ్చే షాపు ఉండేది. ఆయన దగ్గరే సుమన్ మూవీ క్యాసెట్లు తీసుకునేవాడు. ఒకసారి అతని కారు తీసుకుని సుమన్ బయటకు వెళ్లాడు. ఆ కారును దివాకర్ నీలిచిత్రాలు తీయడానికి వాడాడట. ఆ నీలి చిత్రాలలో కూడా సుమన్ హస్తం ఉందని పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి జైలులో వేశారు. ఆ సమయంలో పలువురు సెలబ్రిటీలు సుమన్ కు మద్దతుగా నిలిచారు. కేసులో సుమన్ నిర్దోషిగా బయటపడ్డాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హీరోగా సుమన్ కెరీర్ దాదాపు ముగిసింది. జైలు నుంచి బయటకు వచ్చాక రచయిత డీవీ నరసరాజు మనవరాలిని సుమన్ పెళ్లాడారు.