»No Need Of Action Against Mansoor Ali Khan Actress Trisha
Trisha: దయచేసి మన్సూర్ ను వదిలేయండి.. పోలీసులకు త్రిష లేఖ.. ?
కోలీవుడ్ లో గత కొన్ని రోజులుగా హీరోయిన్ త్రిష, నటుడు మన్సూర్ అలీఖాన్ మధ్య ఎలాంటి వివాదం నడుస్తోందే తెలిసిందే. లియో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మన్సూర్, హీరోయిన్ త్రిష అనుచిత వ్యాఖ్యలు చేయడంతో గొడవ మొదలైంది.
Trisha: కోలీవుడ్ లో గత కొన్ని రోజులుగా హీరోయిన్ త్రిష, నటుడు మన్సూర్ అలీఖాన్ మధ్య ఎలాంటి వివాదం నడుస్తోందే తెలిసిందే. లియో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మన్సూర్, హీరోయిన్ త్రిష అనుచిత వ్యాఖ్యలు చేయడంతో గొడవ మొదలైంది. సినిమాలో త్రిషతో రేప్ సన్నివేశాలు ఉంటాయని తాను భావించినట్లు మన్సూర్ తెలిపాడు. ఓ నటిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో త్రిష అభిమానులు ఫైర్ అయ్యారు. అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తం త్రిషకు మద్దతుగా నిలిచింది. కోలీవుడ్ మాత్రమే కాదు.. టాలీవుడ్ లోనూ త్రిషకు మెగాస్టార్ చిరంజీవి, నితిన్ లు సపోర్ట్ చేశారు. వివాదం కాస్త కోర్టుకు చేరింది. ఇటీవల మన్సూర్ త్రిషకు క్షమాపణలు కూడా చెప్పాడు. ఆమె క్షమాపణలను అంగీకరించింది. అయితే ఇంతలో మన్సూర్ ప్లేటు ఫిరాయించాడు.
నేను.. త్రిషకు సారీ చెప్పడం ఏంటి.. అదో పెద్ద జోక్. మా మేనేజర్ నన్ను చంపేయండి.. అన్న మాటను నన్ను క్షమించండి అని అర్ధం చేసుకుని అలాంటి ప్రకటన చేశాడని చెప్పుకొచ్చాడు. ఈ వివాదం ఇలాగే కొనసాగుతుండడంతో.. పోలీసులు మన్సూర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా త్రిష మన్సూర్ అలీఖాన్ ను వదిలేయాలని లేఖ రాసి కోలీవుడ్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. మన్సూర్ నాకు క్షమాపణ చెప్పాడు. సమాజంలో అందరూ తప్పులు చేస్తారు. మనమే మానవత్వంతో సర్దుకుపోవాలి. ప్లీజ్ పోలీసులు.. మన్సూర్‌ను వదిలేయాలని కోరుతున్నాను.. అతడిపై చర్యలు తీసుకోవద్దంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.