మాస్ మహారాజ రవితేజ(Ravi teja) తెరపై కనిపిస్తే ఫ్యాన్స్ కు పూనకాలే. అటువంటి రవితేజ తన స్టైల్ కి భిన్నంగా నెగిటివ్ షేడ్స్‌తో కనిపిస్తున్న సినిమా రావణాసుర(Ravanasuara). ఈ మూవీకి సంబంధించి ఇంత వరకూ వదిలిన అప్ డేట్స్‌కి అనూహ్య స్పందన వస్తోంది. రావణాసుర(Ravanasuara) సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రవితేజ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.

‘రావణాసుర’ ట్రైలర్:
రావణాసుర(Ravanasuara) సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 7వ తేదిన థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్(Trailer)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. లవ్, కామెడీ, యాక్షన్ తో కూడిన సీన్స్ ను కట్ చేసి ట్రైలర్ గా వదిలారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్(Movie Trailer) సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.
వాడు క్రిమినల్ లాయర్ కాదు..లా చదివిన క్రిమినల్ అనే డైలాగ్ ట్రైలర్(Trailer)కు హైలెట్‌గా నిలిచింది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ మూవీకి మ్యూజిక్(music) అందించారు. ఈ మూవీలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా(Movie)లో రావు రమేశ్, సంపత్ రాజ్, మురళీ శర్మ వంటివారు ముఖ్య పాత్రలు పోషించారు.