సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర.. సుశాంత్ కీ రోల్ ప్లే చేస్తుండగా.. పూజితా పొన్నాడ, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మానుయేల్, దక్షా నాగర్కర్, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైరల్తో అంచనాలు పెంచేశారు. అసలు రవితేజ రావణుడా, రాముడా.. అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. కానీ టైటిల్ ప్రకారం రవితేజ విలనిజం నెక్స్ట్ లెవల్లో ఉంటుందని అంటున్నారు. అందుకే ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడు లేని విధంగా కనిపించబోతున్నాడు రవితేజ. ధమాకా, వాల్తేరు వీరయ్య సక్సెస్ జోష్‌లో రవితేజ నుంచి మూడు నెలల గ్యాప్‌లోనే ఈ సినిమా వస్తోంది. ఇప్పటికే మాస్ రాజా జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈ రోజు సాయంత్రం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇక రిలీజ్ టైం దగ్గర పడడంతో..సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది రావణాసుర. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘ఏ’ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రన్ టైం కూడా బయటకొచ్చేసింది. ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 21 నిమిషాలు లాక్ చేసినట్టు తెలుస్తోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాకు.. ఇది రెగ్యూలర్ అండ్ పర్ఫెక్ట్ రన్ టైం అనే చెప్పాలి. ఇక హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, RT టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి రావణాసుర బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.