»Rashmika Remuneration As A Hot Topic This Is Rashmikas Reaction
Rashmika: హాట్ టాపిక్‌గా రెమ్యూనరేషన్.. రష్మిక రియాక్షన్ ఇదే..!
స్టార్ హీరోలు, హీరోయిన్లు ఒక పెద్ద హిట్ పడితే పారితోషికాలు భారీగా పెరిగిపోతాయి. ఇటీవల రష్మిక మందన్నా బాలీవుడ్ మూవీ యానిమల్తో ఘన విజయంతో తన పారితోషికాన్ని పెంచింది.
Rashmika: స్టార్ హీరోలు, హీరోయిన్ల పారితోషికాల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒక పెద్ద హిట్ పడితే పారితోషికాలు భారీగా పెరిగిపోతాయి. ఇటీవల రష్మిక మందన్నా బాలీవుడ్ మూవీ యానిమల్తో ఘన విజయం సాధించింది. దీంతో ఆమె పారితోషికం 4 కోట్లకు పైగా పెరిగిందని వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై రష్మిక సరదాగా స్పందించింది. తాను పారితోషికం పెంచానని ఎవరు చెప్పారో ఆశ్చర్యంగా ఉందని అన్నారు. మీడియాలో వస్తున్న వార్తలను సీరియస్‌గా తీసుకోవాలని అనుకుంటున్నానని, రెమ్యూనరేషన్ ఎందుకు పెంచారని నిర్మాతలు అడిగితే మీడియా చెప్పిందని చెబుతానని వ్యాఖ్యానించారు. తన పారితోషికం గురించి మీడియాలో వస్తున్న వార్తలను తాను సీరియస్‌గా తీసుకోవాలనుకుంటున్నట్లు ఆమె వ్యాఖ్యానించడం విశేషం.
మరోవైపు రష్మిక రెస్పాన్స్ చూసి నిర్మాత ఎస్కేఎన్ కూడా సరదాగా స్పందించాడు. రష్మికతో తాము తీస్తున్న గర్ల్ ఫ్రెండ్ మూవీని ఈ ఆర్టికల్ రావడానికి ముందే మొదలు పెట్టడం సంతోషంగా ఉందని అతను వ్యాఖ్యానించాడు.
ఈ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా స్థాయిలో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. ఈ ఏడాది పుష్ప-2 లాంటి భారీ మూవీతో రాబోతోంది. ఇంకో అరడజన్ దాకా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.