నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది అమ్మడు. తాజాగా హీరోయిన్గా ఏడెళ్లు పూర్తి చేసుకుంది రష్మిక. దీంతో సోషల్ మీడియాలో అమ్మడు పేరు మార్మోగిపోతోంది.
Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉంది. అమ్మడికి బడా బడా ఆఫర్లొస్తున్నాయి. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది. దాంతో ప్రస్తుతం రష్మిక చేతిలో పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా బ్యూటీగా మారిపోయిన రష్మిక.. ప్రజెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ సీక్వెల్ ‘పుష్ప2’లో నటిస్తోంది. అలాగే ‘రెయిన్బో’ అనే లేడీ ఓరియెంటేడ్ ప్రాజెక్ట్ చేస్తోంది. రీసెంట్గా ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే మరో లేడీ ఓరియేంటేడ్ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టింది. శేఖర్ కమ్ముల, ధనుష్ సినిమాలోను నటిస్తోంది.
యానిమల్తో సాలిడ్ హిట్ కొట్టిన రష్మిక.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు మోస్ట్ వాంటేడ్ హీరోయిన్గా మారిపోయింది. అయితే.. డిసెంబర్ 30తో రష్మిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఆమె అభిమానులు. 2016లో ‘కిరాక్ పార్టీ’ అనే కన్నడ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. ఈ ఏడేళ్లలో మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్, రణ్‌బీర్ కపూర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. తెలుగులో నాగ శౌర్య నటించిన ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గీతాగోవిందం సినిమాతో స్టార్ లిస్ట్‌లోకి చేరిపోయింది. ఇక పుష్ప, సీతారామం, యానిమల్ వంటి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటింది. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌తో రష్మిక క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం గ్యారెంటీ. ఏదేమైనా.. తగ్గేదేలే అంటూ రష్మిక కెరీర్ ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోందని చెప్పొచ్చు.