»Rashmika Mandanna Out Of Nithins Movie Sreeleela In
Nithin: సినిమా నుంచి రష్మిక అవుట్..శ్రీలీల ఇన్!
యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఇప్పటికే ఐదారు చిత్రాలను ఒప్పుకోగా..తాజాగా మరో మూవీకి కూడా గ్రిన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నటి ఇప్పుడు నితిన్‌తో దర్శకుడు వెంకీ కుడుముల పేరులేని చిత్రంలో రష్మిక మందన్న స్థానంలోకి వచ్చింది.
క్రేజీ హీరోయిన్ శ్రీలల(Sreeleela)కు ఆఫర్లు క్యూలు కడుతున్నాయి. ఇప్పటికే ఈ అమ్మడి చేతిలో దాదాపు పది సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ మోస్ట్ బిజీ నటిగా మారిపోయింది. కాగా, ఇప్పుడు ఆమె జాబితాలో మరో సినిమా కూడా చేరడం విశేషం. ఆమె మరొక క్రేజీ ప్రాజెక్ట్‌ను కైవసం చేసుకుంది. ఆ చిత్రంలో ఒక ప్రముఖ హీరోయిన్ను భర్తీ చేసింది. సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత కూడా నటీమణులు, సాంకేతిక నిపుణులను భర్తీ చేయడం కొత్తేమీ కాదు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇంతకుముందు సూపర్‌హిట్ భీష్మను అందించిన నితిన్, రష్మిక , దర్శకుడు వెంకీ కుడుముల విజయవంతమైన కాంబినేషన్లో చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ చిత్రం #VNRTrio అనే తాత్కాలిక టైటిల్‌తో ప్రకటించారు. పూజా కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.
ఇప్పుడు ఈ సినిమాలో రష్మిక(Rashmika mandanna) స్థానంలో శ్రీలీలని తీసుకున్నారు. రష్మిక ప్రస్తుతం పుష్ప2, ఇంద్రధనస్సు చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె ఇటీవల రణబీర్ కపూర్ నటించిన యానిమల్ చిత్రంలో తన భాగాన్ని ముగించింది. డేట్స్ సమస్యలతో రష్మిక తప్పుకుందనే వార్తలు వినపడుతన్నాయి. కానీ, శ్రీలీల అంతకంటే బిజీ నటి. మరి ఆమెకు డేట్స్ సమస్య రాదా అనే కామెంట్స్ వినపడుతున్నాయి. కారణాలేమైనా శ్రీలీల మరో సినిమా దక్కించుకుంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. టీమ్ చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్‌లలో ఉంది. నితిన్ స్లీలిష్, స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తుండగా, శ్రీలీల ఈ చిత్రంలో అల్ట్రా-మోడ్రన్ లుక్‌లో కనిపించనుంది.