Ram Charan : ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. రామ్ చరణ్ పేరుని తెగ ట్రెండ్ చేస్తున్నారు మెగాభిమానులు. ప్రస్తుతం చరణ్ RC 15 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు చెర్రీ. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. రామ్ చరణ్ పేరుని తెగ ట్రెండ్ చేస్తున్నారు మెగాభిమానులు. ప్రస్తుతం చరణ్ RC 15 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు చెర్రీ. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ వైజాగ్‌లో గీతం యూనివర్సిటీలో చరణ్ పై ఇంట్రో సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ పాటకి బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నారు. అయితే షూటింగ్ గ్యాప్‌లో గణేష్ ఆచార్యతో కలిసి రామ్ చరణ్ ఓ బాలీవుడ్ సాంగ్‌కి స్టెప్పులు వేశారు. గతంలో అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ కలిసి నటించిన ‘మైన్ ఖిలాడీ తు అనారి’ సినిమాలోని టైటిల్ ట్రాక్‌కు అదిరిపోయే స్టెప్పులేశారు. ఈ సాంగ్‌ను అక్షయ్ కుమార్ లేటెస్ట్ ఫిల్మ్ ‘సెల్ఫీ’లో రీమిక్స్ చేశారు.
అందుకే ఇప్పుడా పాటకు రామ్ చరణ్ ఓ రీల్ లాగా అదిరిపోయే స్టెప్పులేశాడు. సింప్లీ సూపర్బ్ లుక్‌లో అదరగొట్టేశాడు. దీన్ని తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు చరణ్. దాంతో చరణ్ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మామలూగానే డ్యాన్స్ విషయంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు మెగా పవర్ స్టార్. అలాంటి స్టార్ హీరో ఓ చిన్న రీల్ చేస్తే రచ్చ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం ట్విట్టర్లో అదే చేస్తున్నారు చరణ్ ఫ్యాన్స్. చరణ్ డ్యాన్స్‌ను తెగ షేర్ చేస్తున్నారు. దాంతో సోషల్ మీడియా మోత మోగిపోతోంది.