»Rajinikanth With An Unexpected Director Dil Raju Big Planning
Rajinikanth : ఊహించని డైరెక్టర్‌తో రజనీకాంత్.. దిల్ రాజు భారీ ప్లానింగ్!?
Rajinikanth : వాల్తేరు వీరయ్యతో సాలిడ్ అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ బాబీ. తన అభిమాన హీరో మెగాస్టార్‌కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే రవితేజతో తన పవర్ ఏంటో చూపించిన బాబీ.. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో జై లవ కుశ చేశాడు. ఈ సినిమా బాబీని స్టార్ డైరెక్టర్ని చేసింది.
వాల్తేరు వీరయ్యతో సాలిడ్ అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ బాబీ. తన అభిమాన హీరో మెగాస్టార్‌కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే రవితేజతో తన పవర్ ఏంటో చూపించిన బాబీ.. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో జై లవ కుశ చేశాడు. ఈ సినిమా బాబీని స్టార్ డైరెక్టర్ని చేసింది. అందుకే చిరంజీవితో ఛాన్స్ కొట్టేశారు. ఇటీవల వచ్చిన వాల్తేరు వీరయ్యలో వింటేజ్ మెగాస్టార్‌ని చూపించి సక్సెస్ అయ్యాడు బాబీ. మరి బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? హీరో ఎవరు? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఊహకందని విధంగా ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంతో బాబీ ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌తో ‘వారిసు’ సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు నిర్మాత దిల్ రాజు. ఇక ఇప్పుడు రజనీ కాంత్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తలైవాకు సాలిడ్ కథ నరేట్ చేశారని.. రజనీకాంత్ కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. అంతేకాదు సూపర్ స్టార్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో డైరెక్టర్ ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. అయితే ఇప్పుడు ఊహించని విధంగా బాబీ పేరు తెరపైకొచ్చింది. ఇది మాత్రం నిజంగానే షాకింగ్‌గా ఉంది. ఏకంగా సూపర్ స్టార్‌తో ఛాన్స్ అంటే.. మామూలు విషయం కాదు. కానీ ఇప్పటికే రజనీ కాంత్ మూడు, నాలుగు సినిమాలు కమిట్ అయి ఉన్నారు. దాంతో బాబీ ప్రాజెక్ట్ ఎప్పుడుంటుందనేది ఇప్పుడే చెప్పలేం. అయితే.. అసలు రజనీకాంత్, దిల్ రాజు, బాబి కాంబినేషన్ నిజమేనా? లేదా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.