ప్రభాస్, రాజమౌళి.. ఈ ఇద్దరి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరి మధ్య అంతకుమించి అనుబంధం ఉంది. ఛత్రపతి సినిమా చేసిన తర్వాత.. ఇద్దరి మధ్య బాండింగ్ మరింత బలపడింది. అందుకే బాహబలితో పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసి.. సినిమా ప్రపంచాన్నే తమవైపుకు తిప్పుకున్నారు. అక్కడి నుంచి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక జక్కన్న అయితే.. ఆర్ఆర్ఆర్ మూవీతో హాలీవుడ్ రేంజ్లో దూసుకుపోతున్నారు. అయితే ఈ ఇద్దరి నుంచి ఇప్పట్లో మరో సినిమా రావడం ఇప్పట్లో కష్టమే. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా.. ఇద్దరు కలుస్తునే ఉంటారు.. తమ సినిమాలను ప్రమోట్ చేస్తుంటారు. తాజాగా ప్రభాస్ రాజమౌళి పై పొగడ్తల వర్షం కురిపించారు. ఆస్కార్ అవార్డు దిశగా అడుగులు వేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ.. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఇటీవల న్యూయ్కార్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్‌గా రాజమౌళి అవార్డు అందుకున్నారు. అలాగే లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్, బోస్టన్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డులన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి దక్కించుకున్నారు. తాజాగా ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు ఆర్ఆర్ఆర్ నామినేట్ అయ్యింది. ఈ సందర్భంగా రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపారు ప్రభాస్. దానికి జక్కన్న ఇచ్చిన సాలిడ్ రిప్లై ప్రస్తుతం వైరల్ గా మారింది.. థాంక్యూ డార్లింగ్.. నాపై నాకే నమ్మకం లేని సమయంలో.. నాకు ఇంటర్నేషనల్ లెవెల్ గుర్తింపు వస్తుందని నమ్మావు.. అని రాసుకొచ్చారు రాజమౌళి. దాంతో ప్రభాస్-రాజమౌళి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.