»Pushpa 2 Working Stills Release Solid Clarity On Glimps
‘Pushpa 2’ వర్కింగ్ స్టిల్స్ రిలీజ్.. గ్లింప్స్ పై సాలిడ్ క్లారిటీ!
Pushpa 2 : పుష్ప పార్ట్ వన్‌లో పుష్పరాజ్ ఎదుగుదలను చూపించిన సుకుమార్.. పుష్ప సెకండ్ పార్ట్‌లో పవర్ ఫుల్ రూలింగ్ చూపించబోతున్నాడు. పుష్ప2 అప్డేట్ కోసం ఏడాదికి పైగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎట్టకేలకు సుకుమార్ సాలిడ్ అప్డేట్ ఇచ్చేశాడు. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్పరాజ్ హంగామా స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా Hunt before The RULE పేరుతో అనౌన్స్మెంట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే ఉంది. దాంతో ఓ రోజు ముందే.. పుష్ప2 నుంచి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు సుక్కు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్నట్టు.. అసలు పుష్ప ఎక్కడ? అంటూ గ్లింప్స్‌తో ఎన్నో డౌట్స్ క్రియేట్ చేశాడు మన లెక్కల మాస్టారు.
ఏప్రిల్ 7న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు.. తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్పరాజ్ ఎక్కడున్నాడో రివీల్ చేయనున్నాడు. ఇదే కాదు పుష్ప2 గ్లింప్స్‌లో అంతకుమించిన బిగ్ సర్ప్రైజ్లు ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో పలు భాషలకు చెందిన స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. ఓ బాలీవుడ్ స్టార్ హీరో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ పుష్ప2లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇదే ఈ విషయాన్ని పుష్ప 2 వీడియో గ్లింప్స్‌లో రివీల్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. పుష్పరాజ్ బాక్సాఫీస్ రూలింగ్ లెక్క వేరేలా ఉంటుంది.
అయితే బాలీవుడ్ హీరో ఉన్నా లేకపోయినా.. గ్లింప్స్ మాత్రం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. వీడియో రిలీజ్‌కు ముందు కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను రిలీజ్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్. విలన్‌గా నటిస్తున్న ఫహాద్ ఫాజిల్‌కు.. సీరియస్‌గా సీన్ గురించి వివరిస్తున్నాడు సుకుమార్. అలాగే రైటర్ టీమ్‌తో డిస్కషన్స్, ఆస్కార్ విజేత, లిరిసిస్ట్ చంద్రబోస్‌తో చర్చలు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌తో డ్యాన్స్ గురించి మాట్లాడుతున్నాడు.
దీంతో పుష్ప2 గ్లింప్స్‌లో ఎంట్రీ సాంగ్, ఫైట్‌తో పాటు బిగ్ సర్ప్రైజ్ కూడా ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. అయితే ఇలాంటి విషయాల్లో మరింత క్లారిటీ రావాలంటే.. ఇంకొన్ని గంటలు ఓపిక పట్టాల్సిందే.