‘Project K’ నుంచి సర్ప్రైజ్ వీడియో.. మామూలుగా లేదుగా!
Project K : 'మహానటి' తర్వాత టాలెటెండ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'ప్రాజెక్ట్ కె' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తుండగా.. అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12 రిలీజ్ చేయబోతున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ప్రాజెక్ట్ కె’ పాన్ వరల్డ్ రేంజ్‌తో తెరకెక్కుతోంది. మహానటి తర్వాత టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేస్తున్న సినిమా ఇదే. వైజయంతీ మూవీస్ వారు దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను సైన్స్ ఫిక్షనల్ డ్రామాగా భారీగా రూపొందిస్తున్నారు.
దీపిక పదుకోణే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ లాంటి వారు కీ రోల్ ప్లే చేస్తున్నారు. దాదాపుగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోవడానికి రెడీ అయిన ఈ మూవీని.. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను అడ్వాన్స్డ్ టెక్నాలజితో ఊహించని కంటెంట్‌తో తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్.
అద్భుతమైన విజువల్ వండర్‌గా ఈ సినిమా రాబోతోంది. అయితే ఈ సినిమా కోసం ప్రతిదీ స్క్రాచ్ నుంచి కొత్తగా తయారు చేయిస్తున్నాడు నాగ్ అశ్విన్. గతంలో ‘టైర్’కి సంబంధించిన వీడియోని రిలీజ్ చేసి.. సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేశాడు. తాజాగా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా.. ‘రైడర్స్’కి సంబంధించిన వీడియోని రిలీజ్ చేసి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు.
ఈ ప్రమోషనల్ వీడియోలో రైడర్స్ అంటే.. విలన్ గ్యాంగ్ అని, వాళ్ల కాస్ట్యూమ్ అండ్ లుక్ కొత్తగా ఉండాలని ప్లాన్ చేశామని చెప్పుకొచ్చారు. రైడర్స్ కోసం సూపర్ హీరో సినిమాల రేంజులో ఒక సూట్‌ని డిజైన్ చేశారు. ఇక వీడియో లాస్ట్‌లో ఏంటీ ప్యాంట్ చినిగిపోయిందా.. అంటూ మార్స్ పై ఉన్న విజువల్‌ని చూపించారు.
ఈ స్క్రాచ్ వీడియోతో ప్రాజెక్ట్ కె పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.