Prabhas: సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్లో ప్రభాస్ సినిమా!?
ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కెతో పాటు.. మారుతితోను ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇక ఆ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో క్లారిటీ లేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ప్రభాస్ ఓ ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమా సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్లో ఉంటుందని సమాచారం.
ఈ మధ్య కాలంలో వచ్చిన లవ్ స్టోరీస్ సినిమాల్లో ది బెస్ట్‌గా నిలిచింది ‘సీతారామం'(Seetharamam Movie). దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా.. హను రాఘవూడి(Director Hanu Raghavapudi) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను వైజయంతి బ్యానర్ వారు నిర్మించారు. ప్రస్తుతం ప్రభాస్‌తో ప్రాజెక్ట్ కెని నిర్మిస్తోంది వైజయంతీ సంస్థ. అందుకే ఇప్పుడు ప్రభాస్‌తో మరో ప్రాజెక్ట్ సెట్ చేసే పనిలో ఉన్నారు. సీతారామం తర్వాత కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు హను రాఘవపూడి. మధ్యలో మళ్లీ దుల్కర్‌తో సినిమా ఉంటుందని.. నాని, శర్వానంద్‌తో మల్టీస్టారర్ మూవీ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ఏకంగా హను రాఘవపూడి ప్రభాస్(Prabhas)తో ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ చెప్పిన కథకు ప్రభాస్(Prabhas) ఇంప్రెస్ అయినట్లు సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా కథ ‘వరల్డ్ వార్ 2’ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. సీతారామం కూడా వార్ బ్యాక్ డ్రాప్లోనే వచ్చింది. దాంతో మరోసారి అలాంటి పవర్ ఫుల్ స్క్రిప్టునే రెడీ చేస్తున్నాడట హను రాఘవపూడి. అసలు ఆ కాంబో వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు గానీ.. వరల్డ్ వార్‌లో ప్రభాస్ సినిమా అనేసరికి.. ఈ ప్రాజెక్ట్ ఇంట్రెస్టింగ్గా మారింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. మరి ఈసారి హను రాఘవపూడి ఎలాంటి లవ్ స్టోరీతో వస్తాడో చూడాలి.