ప్రస్తుతం ప్రభాస్(prabhas) భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. కానీ ఈ మధ్యలో మారుతి(Maruthi)తో ఓ సినిమాను సైలెంట్‌గా పట్టాలెక్కించాడు డార్లింగ్. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్లో ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ వేస్తున్నట్టుగా సమాచారం.
ఈ మధ్య షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas). మోకాలీ సర్జరీ కారణంగా విదేశాల్లో రెస్ట్ మోడ్‌లో ఉన్నాడు డార్లింగ్. నవంబర్ ఫస్ట్ వీక్‌లో ఇండియాకి తిరిగి రానున్నాడని తెలుస్తోంది. ఇక వచ్చిన తర్వాత సెట్స్ పై ఉన్న కల్కి, మారుతి సినిమా షూటింగ్‌తో పాటు సలార్ ప్రమోషన్స్ కూడా చేయనున్నాడు. ఇప్పటికే మారుతి ప్రాజెక్ట్ సైలెంట్‌గా చాలా భాగం షూటింగ్ జరుపుకుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ రాగానే ఇంటర్వెల్ సీక్వెన్స్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట మారుతి. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్(big set) కూడా వేస్తున్నారని తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలెట్‌గా ఉంటుందట.
ముఖ్యంగా ప్రభాస్ గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే తన సినిమాలో వింటేజ్ డార్లింగ్‌ను చూస్తారని చెబుతున్నాడు మారుతి. లీక్డ్ పిక్స్ కూడా అదే చెబుతున్నాయి. దాంతో మారుతి ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. సలార్, కల్కి వంటి వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ప్రభాస్.. మారుతి సినిమాతో ఓ రేంజ్లో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు మారుతి. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు ప్రభాస్. కానీ ఈ సినిమా నుంచి అఫీషియల్ అప్డేట్స్ మాత్రం బయటికి రావడం లేదు. త్వరలోనే ప్రభాస్, మారుతి సినిమా నుంచి సర్ప్రైజ్ ఉంటుందని అంటున్నారు. మరి ఈ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్స్ కోసం మారుతి(Maruthi) ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి.