Dhanush : ప్రస్తుతం రాజకీయం, సినిమాలతో ఫుల్లు బిజీగా ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయినా కూడా మధ్య మధ్యలో చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అవుతున్నాడు. ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో ధనుష్ కోసం ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం రాజకీయం, సినిమాలతో ఫుల్లు బిజీగా ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయినా కూడా మధ్య మధ్యలో చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అవుతున్నాడు. ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో ధనుష్ కోసం ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు తెలుస్తోంది. ధనుష్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన బైలింగ్వల్ మూవీ ‘సార్’. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 17న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో భారీ ఎత్తున ఈవెంట్ ఉంటుందని తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా హాజరుకాబోతున్నట్లు వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్తో కలిసి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య.. ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. అందుకే త్రివిక్రమ్‌తో కలిసి పవన్ ఈ వేడుకకు గెస్ట్‌గా రాతున్నట్లు సమాచారం. ఇప్పటికే ధనుష్ ఈ సినిమాను తెలుగులో ప్రమోట్ చేస్తున్నాడు. ట్రైలర్ లాంచ్‌లో ధనుష్ స్పీచ్ హైలెట్‌గా నిలిచింది. మిగతా తమిళ్ హీరోల్లా కాకుండా ధనుష్ ప్రమోట్ చేయడం ఈ సినిమాకు మరింత ప్లస్. ఇక ఇప్పుడు పవర్ స్టార్ కూడా వస్తున్నాడని అంటున్నారు. ఒకే వేదిక పై ధనుష్, పవన్ కనిపిస్తే సినిమాకు ఆటోమేటిక్‌గా భారీ హైప్ రావడం పక్కా. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.