Pooja Hegde: బాలీవుడ్ లో మరో ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే..!
బుట్ట బొమ్మ పూజా హెడ్డే(Pooja Hegde)కి బాలీవుడ్ లో వరస ఆఫర్లు వెల్లివిరుస్తున్నాయి. టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అనే పేరు తెచ్చుకున్న పూజ, బాలీవుడ్ లో మాత్రం ఆ పేరు సాధించలేకపోయింది.
బుట్ట బొమ్మ పూజా హెడ్డే(Pooja Hegde)కి బాలీవుడ్ లో వరస ఆఫర్లు వెల్లివిరుస్తున్నాయి. టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అనే పేరు తెచ్చుకున్న పూజ, బాలీవుడ్ లో మాత్రం ఆ పేరు సాధించలేకపోయింది. బాలీవుడ్ లో ఇప్పటి వరకు పూజ(Pooja Hegde)కి సరైన హిట్ పడలేదనే చెప్పాలి. ఆ మధ్య రణవీర్ సింగ్ తో నటించిన సినిమా సర్కస్ మూవీ అయితే కనీసం కలెక్షన్స్ కూడా రాలేదు. మరీ అంత రాడ్డు సినిమా ఎలా తీశారా అనే భావన అందరిలోనూ కలిగింది. ఇటీవల వచ్చిన భాయ్ కిసీకా జాన్ కూడా అంతే ప్లాప్ అయ్యింది. సల్మాన్ పక్కన ఛాన్స్ అనగానే ఒప్పేసుకున్నట్లు ఉంది. ఫలితం.. వరస ప్లాపులే మిగిలాయి.
అయినా సరే, ఆమె(Pooja Hegde)కు బాలీవుడ్ లో మరో ఆఫర్ రావడం గమనార్హం. షాహిద్ కపూర్ హీరోగా రూపొందబోయే కోయి షక్ లో హీరోయిన్ గా ఎంపికయ్యిందని ముంబై అప్డేట్. దర్శకుడు రోషన్ ఆండ్రూస్. ఈయన మలయాళం డైరెక్టర్. దుల్కర్ సల్మాన్, మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ లాంటి స్టార్లతో బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. సుధీర్ బాబు రీమేక్ చేసుకున్న హంట్ ఒరిజినల్ వెర్షన్ ముంబై పోలీస్ ఈయనదే. మిస్టరీ థ్రిల్లర్స్ డీల్ చేయడంలో రోషన్ ది ప్రత్యేక శైలి. మొదటిసారి హిందీ డెబ్యూ చేయబోతున్నారు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అయినా హిట్ కొడుతుందో లేదో చూడాలి.