మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్(Ponniyin Selvan 1).. భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయింది. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే కోలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తమిళ తంబీలకు పొన్నియన్ కథ తెలుసు కాబట్టి.. అక్కడ తప్పితే మరో భాషలో అలరించలేదు. అందుకే గత నెల సెప్టెంబర్ 30న భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా.. ఊహించని విధంగా నాలుగు వారాల్లోనే ఓటిటిలోకి వచ్చేసింది.
తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే రిలీజ్ చేశారు.. హిందీ వెర్షన్ ఇంకా రిలీజ్ చేయలేదు. అయితే ఇక్కడే అసలు కథ వేరేలా ఉంది. గతంలో కెజిఎఫ్ 2 మూవీని పే అండ్ సీ మోడ్లో ఓటిటిలోకి తీసుకొచ్చిన అమేజాన్ ప్రైమ్.. పీఎస్-1ని కూడా అదే పద్దతిలో స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది. ఈ సినిమాను ఓటిటిలో చూడాలంటే.. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కలిగి ఉండటంతో పాటు.. అదనంగా 199 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
లేదంటే అమేజాన్ మెంబెర్ షిప్ ఉండి.. ఫ్రీ స్ట్రీమింగ్ కావాలంటే మరో వారం రోజులు వెయిట్ చేయాల్సిందేనని అంటున్నారు. నవంబర్ 4 నుంచి పొన్నియన్ సెల్వన్ ఫ్రీ స్ట్రీమింగ్ ఉంటుందని సమాచారం. ఇకపోతే.. కార్తి, విక్రమ్, జయంరవి, ఐశ్వర్యరాయ్, త్రిష కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా పార్ట్ 2ని.. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.