Pawan Kalyan-Sai Dharam Tej's Vinodaya Sitham Telugu remake update. తమిళ్ హిట్ మూవీ వినోదయ సీతమ్ రీమేక్‌ను.. చడీ చప్పుడు కాకుండా కొబ్బరికాయ కొట్టేశారని టాక్. కానీ ఇప్పటి వరకు సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. అయితే ఇప్పుడు ఈ రీమేక్‌కు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట.
Pawan Kalyan-Sai Dharam Tej’s Vinodaya Sitham Telugu remake update. రాజకీయం కారణంగా.. కమిట్ అయిన సినిమాలను అనుకున్న సమయానికి కంప్లీట్ చేయలేకపోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయినా కూడా కొత్త సినిమాలకు సైన్ చేస్తునే ఉన్నారు. రెండేళ్ల క్రితం స్టార్ట్ అయిన హరిహర వీరమల్లు ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి కాలేదు. కానీ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గతేడాది డిసెంబర్లో హరిశంకర్‌తో ఉస్తాద్ భగత్ సింగ్.. జనవరిలో సాహో దర్శకుడు సుజిత్‌తో ఓజిని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. అయితే అంతకు ముందే తమిళ్ హిట్ మూవీ వినోదయ సీతమ్ రీమేక్‌ను.. చడీ చప్పుడు కాకుండా కొబ్బరికాయ కొట్టేశారని టాక్. కానీ ఇప్పటి వరకు సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. అయితే ఇప్పుడు ఈ రీమేక్‌కు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట. అదే రోజు అఫిషీయల్ అనౌన్స్మెంట్ రాబోతోందట. అయితే ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. కీ రోల్ ప్లే చేస్తున్నాడు. సాయి సరసన హాట్ బ్యూటీ కేతిక శర్మ నటించనున్నట్టు సమాచారం. ఈ సినిమాను ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన సముద్రఖనినే దర్శకత్వం వహించబోతున్నాడు. ఇందులో పవన్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడు. గతంలో ‘గోపాల గోపాల’ సినిమాలోను గాడ్‌గా కనిపించాడు పవన్. ఇక ఇప్పుడు వినోదయ సీతమ్లోను అలాంటి పాత్రే చేయబోతున్నాడు. దాంతో పవన్ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండనుంది. అందుకే కేవలం 20 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చాడని టాక్. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను.. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. మరి ఈ సినిమా అయినా అనుకున్న సమయానికి పూర్తవుతుందేమో చూడాలి.