Pawan Kalyan : తగ్గేదేలే.. పరుగులు పెట్టిస్తున్న పవర్ స్టార్!
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ చూసి ఫుల్లు ఖుషీ అవుతున్నారు అభిమానులు. ఇటీవలె మొదలైన తమిళ బ్లాక్ బస్టర్ 'వినోదయ సీతమ్' రీమేక్ షూటింగ్‌ను అనుకున్న సమయానికి కంప్లీట్ చేసేశారు పవన్. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను.. జులై 28న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు. ఇటీవలె మొదలైన తమిళ బ్లాక్ బస్టర్ ‘వినోదయ సీతమ్’ రీమేక్ షూటింగ్‌ను అనుకున్న సమయానికి కంప్లీట్ చేసేశారు పవన్. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను.. జులై 28న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోవడమే ఆలస్యం.. ఉస్తాద్ భగత్‌సింగ్, ఓజి దర్శకులు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ముందుగా హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే పవర్ స్టార్.. ఈ ప్రాజెక్ట్ కోసం బల్క్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా పవన్ 90 రోజులు కేటాయించినట్టు సమాచారం. ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఇక ఈ సినిమా ఓ షెడ్యూల్ అయిపోగానే.. సుజీత్ ‘ఓజి’ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం లొకేషన్ వేటలో ఉన్నాడు సుజీత్. ఈ సినిమా కథ ముంబైలో జరుగుతున్న నేపథ్యంలో.. ఓజి టీమ్ అక్కడే లొకేషన్లు ఫైనల్ చేసే పనిలో ఉంది. ఇలా ఈ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్‌కు రెడీ అవుతున్నాయి. అయితే క్రిష్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. కానీ ఉస్తాద్, ఓజిలతో పాటే.. వీరమల్లు షూటింగ్ కూడా ఫినిష్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమాలను పూర్తి చేసి.. రాజకీయాలపై ఫోకస్ చేయాలని చూస్తున్నారు పవన్. ఏదేమైనా.. పవన్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రావడం పక్కా అని చెప్పొచ్చు.