Trivikram: త్రివిక్రమ్ ‘బ్రో’ ఇక కష్టమే.. పవన్ ఫ్యాన్స్ ఫైర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ బాండింగ్ గురించి ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు. పవన్ వేసే ప్రతి అడుగులో కనిపించని ఆయుధంగా త్రివిక్రమ్ ఉంటాడని.. ఇండస్ట్రీలో టాక్ ఉంది. టాక్ కాదు.. స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా పలు సందర్భాల్లో త్రివిక్రమ్ గురించి చెప్పుకొచ్చాడు. అందుకే పవన్‌తో సినిమా చేయాలంటే.. ముందుగా త్రివిక్రమ్‌ని ఒప్పించాల్సి ఉంటుంది. కానీ బ్రో విషయంలో మాత్రం త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్నారు పవన్ ఫ్యాన్స్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ ఈ శుక్రవారం భారీ స్థాయిలో విడుదలైంది. సముద్ర ఖని డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. తమిళ్లో హిట్ అయిన వినోదయ సీతమ్ రీమేక్‌గా బ్రో తెరకెక్కింది. అయితే.. అసలు సముద్ర ఖనితో పవన్ సినిమా ఏంటి? అని అనుకున్నారు మొదట్లో. కానీ త్రివిక్రమ్ వల్లే ఈ ప్రాజెక్ట్ సెట్ అయిందని సముద్ర ఖని చెప్పుకొచ్చాడు. మాటల మాంత్రికుడికి కథ చెప్పగా.. పవర్ స్టార్ అయితే ఓకెనా అని, పవన్ దగ్గరికి కథ వెళ్లకుండాడనే.. సముద్రఖనికి షాక్ ఇచ్చి, పదే పది నిమిషాల్లో ఈ సినిమా కథను మార్చేశాడు. దాని ఎఫెక్టే ఇప్పుడు బ్రో రిజల్ట్ అని అంటున్నారు.
అసలు త్రివిక్రమ్ నుంచి సినిమా వచ్చి చాలా రోజులే అవుతోంది. ఇన్ని రోజులు పవన్ సినిమాలతోనే బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. అంతేకాదు.. గుంటూరు కారం సినిమాను కూడా లైట్ తీసుకున్నట్టే కనిపిస్తోంది వ్యవహారం. భీమ్లా నాయక్ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన త్రివిక్రమ్.. బ్రో సినిమాకు అదే పని చేశాడు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లో మాత్రం త్రివిక్రమ్ మార్క్ ఎక్కడా కనిపించలేదు. డైలాగ్స్ కూడా పేలలేదు.
ఏదో ఇంటర్య్యూలో విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్టుగా.. పవన్ సినిమాల్లోని కొన్ని సీన్స్‌ను తీసుకొని అక్కడక్కడ వేస్తే చాలు సినిమా హిట్ అవుతుందన్నట్టుగా.. బ్రో మూవీ ఉందని అంటున్నారు. వింటేజ్ పవన్‌ను చూపించి.. అసలు కథను తగ్గించేశాడనే రివ్యూలు వచ్చాయి. దీంతో త్రివిక్రమ్ బ్రాండ్ తగ్గినట్టేనని ఇంటస్ట్రీ టాక్. ఇకపై పవన్ కళ్యాణ్ సినిమాల్లో త్రివిక్రమ్ పని చేసినా కూడా ఫ్యాన్స్ అతన్ని నమ్మేలా కనిపించడం లేదంటున్నారు. ఎందుకంటే.. త్రివిక్రమ్ కేవలం పవన్‌ను రీమేక్ సినిమాలు మాత్రమే చేసేలా చేస్తున్నాడని అంటున్నారు. మరి ఫైనల్‌గా బ్రో రిజల్ట్ ఏం చేస్తుందో చూడాలి.