Parineeti Chopra to tie knot with Raghav Chadha in October
Parineeti-Chadha:బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా (Parineeti Chopra), ఎంపీ రాఘవ చద్దా (Raghav Chadha) పెళ్లి గురించి ఒక్కటే చర్చ.. వాళ్లిద్దరూ కలిసి తిరగడంతో సోషల్ మీడియా కోడై కూసింది. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కూడా చద్దాకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇక తమ పెళ్లి (marriage) గురించి నాన్చొద్దు అని ఇద్దరూ అనుకున్నారు. పెళ్లి తేదీని ప్రకటించేశారు.
పరిణితి (Parineeti Chopra)- రాఘవ్ (Raghav)నిశ్చితార్థం జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి సంబంధించి నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయ బద్దంగా రోకా సెర్మనీ నిర్వహించారట. ఆ తర్వాత తంతు వివాహామే. అక్టోబర్లో (october) వీరి పెళ్లి జరగనున్నట్టు తెలిసింది. నిశ్చితార్థం కొద్దిమంది సమక్షంలో జరగగా.. పెళ్లి వైభవంగా నిర్వహిస్తారని సమాచారం. రాఘవ్- పరిణితి గత కొంతకాలంగా డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
పరిణితి- రాఘవ్ ఇదివరకు డిన్నర్ డేట్ (Dinner Date), లంచ్ మీటింగ్స్ (Lunch Meets) అంటూ చెట్టాపట్టాలేసుకు తిరిగారు. ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. డేటింగ్లో ఉన్నారని, త్వరలో వివాహం చేసుకోబోతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దానిపై ఇప్పుడు ప్రకటన వచ్చింది.