అఖండ, వీరసింహారెడ్డి జోష్‌లో ఉన్న బాలయ్య హ్యాట్రిక్ కొట్టేందుకు దసరాకు భగవంత్ కేసరిగా ఆడియెన్స్ ముందుకొచ్చాడు. అనుకున్నట్టే ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు బాలయ్య. దాంతో వంద కోట్ల వైపు దూసుకుపోతోంది భగవంత్ కేసరి.
డిసెంబర్ 22 కోస యావత్ ఇండియా మొత్తం ఎదురు చూస్తోంది. ఆ రోజు ప్రభాస్ 'సలార్', షారుఖ్ ఖాన్ 'డంకీ' సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే డంకీ ఈ రేసు నుంచి తప్పుకుంటుంది అనుకుంటే.. మరింత ముందుకొచ్చేసింది.
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. మొగల్తూరులోని తన ఫ్రెండ్ అనారోగ్యం చెందడంతో అపోలో ఆస్పత్రిలో ఆయన ట్రీట్‌మెంట్ కోసం సాయం చేశారు. అలాగే ఆస్పత్రికి వెళ్లి తన ఫ్రెండ్‌ని కలిసి పరామర్శించారు.
కోలీవుడ్ స్టార్ హీరో కార్తికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. యుగానికి ఒక్కడు నుంచి మొన్నటి పొన్నియన్ సెల్వన్2 వరకు అన్ని సినిమాలు టాలీవుడ్‌లో మంచి ఓపెనింగ్స్ రాబట్టాయి. త్వరలోనే జపాన్ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు కార్తి. ఈ సినిమా కోసం నాగార్జున రంగంలోకి దిగాడు.
అందరు హీరోల అభిమానులు కొత్త సినిమాల అప్డేట్స్‌తో సందడి చేయడానికి రెడీ అవుతుంటే.. మెగాభిమానులు మాత్రం నిరాశలో ఉన్నారు. ఈసారి దసరాకు రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ చేంజర్' నుంచి సాలిడ్ అప్డేట్ వస్తుందని అనుకున్నారు. కానీ మళ్లీ నిరాశ తప్పదని అంటున్నారు.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌డమ్ అందుకున్న రష్మిక.. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా మరో కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. ఇది లేడీ ఓరియెంటేడ్ సినిమా కావడం విశేషం.
జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్‌కు 3 అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న వారికి మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ పార్టీ ఇచ్చారు.
ఈసారి రావడం పక్కా.. బాక్సాపీస్ షేక్ చేయడం పక్కా అంటున్నారు గుంటూరు కారం మేకర్స్. కానీ అలా అంటూనే మరోసారి ఘట్టమనేని అభిమానులకు హ్యాండ్ ఇచ్చేశారు. దసరాకు గుంటూరు కారం అప్డేట్స్ ఏమి లేవని క్లారిటీ ఇచ్చేశాడు తమన్.
గత కొన్నాళ్లుగా పీకల్లోతు ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. ఫైనల్‌గా ఇరు కుటుంబాలను ఒప్పించి.. ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌తో బిజీగా ఉన్నా ఈ జంట.. తాజాగా ఇటలీ ఫ్లైట్ ఎక్కేసింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కూడా సినిమాలు నిర్మిస్తోంది. ఇక ఇప్పుడు వీరి కొడుకు కూడా టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. కాకపోతే.. హీరోగా కాదని తెలుస్తోంది.