కోలీవుడ్ స్టార్ హీరో కార్తికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. యుగానికి ఒక్కడు నుంచి మొన్నటి పొన్నియన్ సెల్వన్2 వరకు అన్ని సినిమాలు టాలీవుడ్లో మంచి ఓపెనింగ్స్ రాబట్టాయి. త్వరలోనే జపాన్ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు కార్తి. ఈ సినిమా కోసం నాగార్జున రంగంలోకి దిగాడు.
కోలీవుడ్ హీరో కార్తి, కింగ్ నాగార్జున మధ్య మంచి బాండింగ్ ఉంది. ఈ ఇద్దరు కలిసి నటించిన ‘ఊపిరి’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి నాగార్జున, కార్తీ మధ్య మంచి బంధం ఏర్పడింది. అందుకే.. కార్తి సినిమాలను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటుంది అన్నపూర్ణ స్టూడియోస్. ప్రస్తుతం కార్తి ‘జపాన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కార్తి నటిస్తున్న 25వ సినిమాగా కావడంతో.. జపాన్ ల్యాండ్ మార్క్‌గా నిలవబోతోంది. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. దీపావళికి రిలీజ్ కానుంది.
తాజాగా ఈ సినిమా తెలుగు రైట్స్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ ఫ్యాన్సీ రేటుకి దక్కించుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లోకి ఈ ప్రాజెక్ట్ రావడంతో జపాన్ గ్రాండ్ గా భారీ ఎత్తున విడుదల కానుంది. రీసెంట్గా రిలీజ్ అయిన జపాన్ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో కార్తి డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. టీజర్లో పూర్తిగా భిన్నంగా కనిపించాడు. ఖచ్చితంగా జపాన్ సినిమా కార్తి కెరీర్లో ఓ డిఫరెంట్ సబ్జెక్ట్‌గా నిలిచిపోయేలా ఉంది.
కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తున్న సునీల్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ ఈ సినిమాతో తొలిసారిగా నటుడిగా పరిచయం అవుతుండగా.. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత.. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో నటించిన సర్దార్ సినిమాకు సీక్వల్ అనౌన్స్ చేశాడు కార్తి. అలాగే ఖైదీ 2 కూడా చేయనున్నాడు.