»Mythri Movie Makers Give Grand Party To National Award Winners
National Awards: ఇద్దరం పోరంబోకులం.. ఢిల్లీ వెళ్లి ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నాం: అల్లు అర్జున్
జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్‌కు 3 అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న వారికి మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ పార్టీ ఇచ్చారు.
జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఇటీవలె కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకగా జరిగింది. ఈ 69వ నేషనల్ ఫిలిం అవార్డ్స్‌లో తెలుగు సినిమాలకు పలు అవార్డులు లభించాయి. ఈ తరుణంలో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్‌కు ఏకంగా 3 జాతీయ అవార్డులు లభించాయి. ఈ నేపథ్యంలో అవార్డులు అందుకున్న సెలబ్రిటీలకు మైత్రీ నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌లు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. హైదరాబాద్ లోని గండిపేటలో ఈ అవార్డుల ప్రధానోత్సవం సాగింది.
Honouring the National Award Winners, the pride of Telugu Cinema ❤🔥
పుష్ప సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవార్డును అందుకున్నాడు. అలాగే ఆ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌కు కూడా ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు లభించింది. మైత్రీ బ్యానర్లో రూపొందిన ఉప్పెన సినిమాకు కూతా ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా అవార్డులు లభించిన సెలబ్రిటీలను మైత్రీ మూవీ మేరక్స్ సన్మానించారు. అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్, బుచ్చిబాబులతో పాటుగా నేషనల్ ఫిలిం అవార్డ్స్ అందుకున్న కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌ను కూడా సన్మానించారు.
The National Award Winning blockbuster duo – Icon Star @alluarjun and Rockstar @ThisIsDSP had a fun moment on stage ❤🔥
ఇద్దరం పోరంబోకులం.. ఢిల్లీ వెళ్లి ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నాం: అల్లు అర్జున్
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మైత్రీ వేదికపై మాట్లాడుతూ..తనతో పాటు దేవిశ్రీ ప్రసాద్‌కు నేషనల్ అవార్డు రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ అవార్డులు రావడం పట్ల తన తండ్రి అల్లు అరవింద్ చాలా సంతోషపడ్డారని, తన ఇద్దరు కొడుకులకు జాతీయ అవార్డు వచ్చినట్లు ఉందంటూ మురిసిపోయారన్నారు. ఈరోజు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి లేకపోవచ్చు గానీ దేవి తన బిడ్డలాంటివాడేనని, అతను అవార్డు అందుకోవడాన్ని చూసేందుకు అల్లు అరవింద్ ఢిల్లీ వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. అవార్డు అందుకున్న తర్వాత తన తండ్రి అల్లు అరవింద్‌తో మాట్లాడిన సంభాషణను బన్నీ మైత్రీ వేదికపై పంచుకున్నారు. చెన్నైలో ఇద్దరు పోరంబోకులు, కనీసం స్కూలు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి సర్టిఫికెట్లు తీసుకోని వాళ్లు, ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్ మెడల్ అందుకుంటామని అనుకున్నావా? అంటూ అల్లు అరవింద్‌ను అడిగినట్లు చెప్పారు. బన్నీ ఆ మాటలు చెప్పగానే మైత్రీ పార్టీకి హాజరైన సినీ తారలంతా ఫక్కున నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.