అందరు హీరోల అభిమానులు కొత్త సినిమాల అప్డేట్స్తో సందడి చేయడానికి రెడీ అవుతుంటే.. మెగాభిమానులు మాత్రం నిరాశలో ఉన్నారు. ఈసారి దసరాకు రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ చేంజర్' నుంచి సాలిడ్ అప్డేట్ వస్తుందని అనుకున్నారు. కానీ మళ్లీ నిరాశ తప్పదని అంటున్నారు.
అసలు గేమ్ చేంజర్ (GameChanger) పరిస్థితేంటి? అనేది ఎటూ తేల్చుకోలేకపోతున్నారు మెగాభిమానులు. అప్పుడప్పుడు షూటింగ్ స్పాట్ ఫోటో షేర్ చేస్తూ వస్తున్నాడు తప్పితే.. అసలు గేమ్ చేంజర్ నుంచి సాలిడ్ అప్డేట్ మాత్రం ఇవ్వడం లేదు శంకర్ (Director Shankar). దిల్ రాజు (Dil Raju) కూడా గేమ్ చేంజర్ గురించి ఏమి చెప్పడం లేదు. దీంతో ఇప్పట్లో ఈ సినిమా ఉంటుందా? లేదా? అనే డౌట్స్ వస్తున్నాయి. పైగా శంకర్ ‘ఇండియన్2’ని కూడా నెత్తిన పెట్టుకున్నాడు కాబట్టి.. గేమ్ చేంజర్ అప్డేట్స్ ఏవి బయటికి రావడం లేదు. కానీ దసరాకు మాత్రం గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్ రావడం గ్యారెంటీ అనుకున్నారు.
అయినా కూడా మెగా ఫ్యాన్స్ ఈ వార్తను నమ్మలేదు. కానీ రీసెంట్గా లీక్ అయినా సాంగ్‌నే రిలీజ్ చేస్తారని చెప్పడంతో.. కాస్త నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం గేమ్ చేంజర్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవని తెలుస్తోంది. దసరాకు ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేస్తారని వచ్చిన వార్తల్లో.. నిజం లేదని అంటున్నారు. సాంగ్ రిలీజ్‌కు రెడీ గా ఉన్నా దసరాకు మాత్రం రిలీజ్ చేసే ఛాన్స్ లేదట.
అందుకే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదని సమాచారం. ఒకవేళ.. ఈసారి నిజంగానే గేమ్ చేంజర్ అప్డేట్ రాకపోతే మాత్రం.. చరణ్ ఫ్యాన్స్‌కు ఇంతకు మించిన డిసప్పాయింట్ మరోటి ఉండదు. దసరా లాంటి పెద్ద పండగకే అప్డేట్ లేదంటే.. ఇప్పట్లో గేమ్ చేంజర్ నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చే ఛాన్సే లేదంటున్నారు. కానీ.. ఈసారి ఏదైనా పోస్టర్‌తో సరిపెట్టే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా.. గేమ్ చేంజర్ విషయంలో ఎప్పటికప్పుడు నిరాశకు గురవుతునే ఉన్నారు చరణ్ ఫ్యాన్స్.