Director Hari: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. యముడు, సింగం 2 వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు హరి.. తండ్రి విఎ గోపాలకృష్ణన్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గోపాలకృష్ణన్ అంత్యక్రియలు ఈరోజు తూర్పు గోదావరి జిల్లా హరి స్వస్థలమైన కాచనవిలైలో నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
అంతకుముందు, ఆయన భౌతికకాయాన్ని శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు చెన్నైలోని సాలిగ్రామ్లోని హరి నివాసంలో ఉంచారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఇదిలా ఉంటే.. హరి ప్రస్తుతం విశాల్ హీరోగా ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 2003లో సామి, 2010లో సింగం సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన హరి ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా హిట్ అందుకోలేకపోయాడు.