మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. మొగల్తూరులోని తన ఫ్రెండ్ అనారోగ్యం చెందడంతో అపోలో ఆస్పత్రిలో ఆయన ట్రీట్మెంట్ కోసం సాయం చేశారు. అలాగే ఆస్పత్రికి వెళ్లి తన ఫ్రెండ్‌ని కలిసి పరామర్శించారు.
టాలీవుడ్ (Tollywood) సినీ ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన స్నేహితుడికి సాయం చేశాడు. మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం 157వ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న చిరంజీవి ఈ మధ్యనే హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో ఉన్న దంపతులతో మాట్లాడారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
@KChiruTweets gari చిన్ననాటి మిత్రులైన మొగల్తూరు వాస్తవ్యులు పువ్వాడ రాజా గారి ఆరోగ్య పరిస్థితిని హైదరాబాదు అపోలో హాస్పిటల్లో డాక్టర్స్ ని అడిగి తెలుసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి గారు…! 🙏🙏🙏
చిరంజీవి (Chiranjeevi) మాట్లాడింది మరెవరితోనే కాదు..ఆయన చిన్ననాటి స్నేహితుడే. మొగల్తూరులో పుట్టి పెరిగిన మెగాస్టార్ హైదరాబాద్‌లో సెటిల్ అయినా తన సొంతూరి స్నేహితులను మాత్రం మర్చిపోలేదు. తన ఫ్రెండ్స్‌లో పువ్వాడ రాజా అనే వ్యక్తి ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలిసిన చిరంజీవి తన ఫ్రెండ్‌కి మర్చిపోలేని సాయాన్ని అందించాడు.
హైదరాబాద్ (Hyderabad)లోని అపోలో ఆస్పత్రి (Apollo Hospital) వైద్యులతో మాట్లాడి తన ఫ్రెండ్ చికిత్స కోసం ఏర్పాటన్నీ చూసుకున్నాడు. ఆస్పత్రికి వచ్చిన తన స్నేహితుడిని కలిసి తన బాగోగుల గురించి వైద్యులను ఆరా తీశారు. చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ (Photos Viral) అవుతున్నాయి.